ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. సొంత ఇంటి కల సహకారం చేసుకోవడానికి సామాన్యులు ఎన్నో కష్టాలు పడుతున్నారు.. ఎవరి రేంజ్‌లో వారు మంచి ఇల్లు కొనుగోలు చేయడం లేదా… నిర్మించడానికి ఇష్ట పడతారు.. ఇక, ఇప్పుడు ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది.. అంతే కాదు, ఫామ్‌హౌస్‌లు, విల్లాలు.. ఇలా నిర్మాణ రంగం దూకుడు చూపుతోంది. అందమైన ప్రదేశంలో.. అద్భుతమైన వాతావరణంలో ఇల్లు…. అబ్బో ఇల్లు మాత్రమే కాదు.. ఏకంగా ఓ దీవిని కొనుగోలు చేసే అవకాశం వచ్చింది.. అది కూడా.. హైదరాబాద్‌లో దొరికే ఓ విల్లా ధర కంటే తక్కువకే వచ్చే అవకాశం ఉంది.. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడ? అని తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? అది యునైటెడ్ కింగ్ డమ్ పరిధిలోని స్కాట్లాండ్ సముద్ర తీరానికి కాస్త దూరంలో ఉన్న ప్లాడ్డా దీవి.. ఆ దీవిని అమ్మకానికి పెట్టారు.. 3.5 లక్షల పౌండ్లుగా ధర నిర్ణయించారు.. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.3.5 కోట్లు అన్నమాట.. ఆసక్తి ఉన్నవారు ఓ ప్రయత్నం చేయండి మరి..
Read Also: Collector: కలెక్టర్‌జీ.. ఏమిటీ గజిబిజి?
అయితే, ఈ దీవిని 1990లో కొనుగోలు చేసింది ఓ ఫ్యామిలీ.. వారి వారసులు ప్రస్తుతం దానిని అమ్మకానికి పెట్టారని యూకేకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ పేర్కొంది.. ప్లాడ్డా ద్వీపం ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్లు డెరెక్ మరియు సాలీ మోర్టెన్‌ల యాజమాన్యంలో ఉంది, వారు దీనిని 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారు. స్కాట్లాండ్ యొక్క పశ్చిమ తీరంలో ఉన్న ఈ ద్వీపంలో ఐదు పడక గదుల ఇల్లు, హెలిప్యాడ్, 1790 నాటి లైట్‌హౌస్ ఉన్నాయి.. దీని ధర ముంబైలోని రెండు పడకగదుల ఫ్లాట్ సగటు ధర కంటే.. చాలా తక్కువగా ఉన్నందున ఇది సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
గ్లాస్గో నుండి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపానికి ఆర్డ్రోసాన్ నుండి పడవ ద్వారా చేరుకోవచ్చు. 28 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపం చాలా సంవత్సరాలుగా ఖాళీగా ఉందని, మళ్లీ నివాసయోగ్యంగా మారకముందే పునర్నిర్మాణం అవసరమని చెబుతున్నారు.. ప్లాడ్డా ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్లు డెరెక్ మరియు సాలీ మోర్టెన్‌ల యాజమాన్యంలో ఉంది, వారు దీనిని 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారు. ఇప్పుడు అమ్మకానికి పెట్టినట్టు రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ పేర్కొంది. నీటి బొట్టు ఆకృతిలో స్కాట్లాండ్ సముద్ర తీరంలో అర్రన్ ద్వీపానికి కిలోమీటర్ దూరంలో సముద్రంలో ప్లాడ్డా దీవి ఉంది. నీటి బిందువు ఆకృతిలో ఉన్న ఈ ద్వీపం విస్తీర్ణం 28 ఎకరాలు. ఇందులో ఒక లైట్ హౌజ్ తో కూడిన పెద్ద ఇల్లు, మరో చిన్న ఇల్లు, ఒక బోట్ హౌజ్ ఉన్నాయి. ఒక హెలిప్యాడ్, ట్రాక్టర్ షెడ్ కూడా ఉన్నట్టు ఆ రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది.
ఇక, పెద్ద ఇంటి పక్కన రెండున్నర ఎకరాల్లో తోటలు ఉన్నాయని.. గతంలో అక్కడ పండ్లు, కూరగాయలు పండించారని పేర్కొన్నారు.. పెద్ద ఇంట్లో ఐదు బెడ్రూంలు, రెండు హాళ్లు, ఒక కిచెన్ కం డైనింగ్ రూమ్ ఉండగా.. అయితే, ప్రస్తుతం ఇది ఉపయోగంలో లేదని.. వాటిని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.. ఏమైనా సరుకులు కావాలంటే.. దగ్గరిలోని సిల్వర్ శాండ్స్ బీచ్, దాని పక్కన ఉన్న కిల్డోనాన్ గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. వాటిని చేరుకునేందుకు 15 నిమిషాల పాటు బోటులో ప్రయాణించాల్సి ఉంటుందని పూర్తి వివరాలు రాసుకొచ్చారు.. డాల్ఫిన్లు, సీల్స్ వంటి చాలా రకాల సముద్ర జీవులు, పక్షులకు నిలయమైన ప్లాడ్డా దీవికి సమీపంలో మరికొన్ని పెద్ద దీవులు కూడా ఉన్నాయి. నైట్ ఫ్రాంక్ లిస్టింగ్ ప్రకారం, ఈ ద్వీపం ఒక ముఖ్యమైన సంతానోత్పత్తి ప్రదేశం మరియు వివిధ రకాల వలస సముద్ర పక్షులకు దూరంగా ఉంది. గతంలో ప్లాడ్డా ద్వీపంలో 100 జాతులకు పైగా పక్షులు ఉండేవట.. యూకేలో ఇళ్ల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న సమయంలో ఈ ద్వీపం అమ్మకానికి పెట్టబడింది. స్కాట్లాండ్ సగటు ధర 201,549 పౌండ్లు, వేల్స్ 219,281 పౌండ్లు, ఉత్తర ఐర్లాండ్ 187,833 పౌండ్లుగా ఉంది..