పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బెదిరింపుల వ్యవహారం చర్చగా మారింది.. తమ నేత ఇమ్రాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉందని ఆ పార్టీ నేతలు పేర్కొనడంతో.. పాకిస్థాన్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. ఇమ్రాన్ ఖాన్‌కు పూర్తి భద్రతల కల్పించాలని.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు.. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖను ప్రధాని షరీఫ్ ఆదేశించినట్లు ప్రధాని కార్యాలయం సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇమ్రాన్ భద్రత విషయంలో తక్షణ, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు..
Read Also: Vaccination: 5-12 ఏళ్ల పిల్లలకు అత్యవసర వ్యాక్సినేషన్..!
కాగా, లాహోర్ వేదికగా ఇవాళ ఇమ్రాన్ ఓ ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే, ర్యాలీలో ఆయన పాల్గొనేందుకు సిద్ధం అవుతుండగా బెదిరింపులు వచ్చాయి.. అయితే, వర్చువల్‌గా ఆ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడాలని మద్దతుదారులు కోరినా.. ఇమ్రాన్ ఖాన్ నిరాకరించాడు.. ఓ వైపు బెదిరింపులు, మరో వైపు ర్యాలీతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బుల్లెట్ ప్రూఫ్ భద్రత కల్పించడానికి సమర్థవంతమైన మరియు తక్షణ చర్యలు తీసుకోవాలని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు.. శాంతియుత బహిరంగ సభలు నిర్వహించడం ప్రజాస్వామ్యంలో భాగమని మరియు ఎటువంటి అడ్డంకులు సృష్టించవద్దని పోలీసులను సూచించారు.