Effect On Male Fertility: నేటి వేగవంతమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా, కొన్ని అలవాట్లు పురుషుల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 25 నుంచి 30 ఏళ్ల యువకుల్లో సంతానోత్పత్తిపై సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానోత్పత్తిని కాపాడుకోవాలంటే ఈ 5 అలవాట్లను మానుకోవడం చాలా అవసరం.
Also Read: Cinema Tickets : సగం సినిమా చూసి వెళ్లిపోతే టికెట్ డబ్బులు వాపస్.. బంపర్ ఆఫర్ కదూ
అనారోగ్యకరమైన ఆహారం:
జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ మీట్ ఎక్కువగా తినడం శుక్రాణాల నాణ్యతను తగ్గిస్తుంది. పరిశోధనల ప్రకారం, ప్రాసెస్డ్ మీట్ ఎక్కువగా తినడం క్యాన్సర్ ముప్పును కూడా పెంచుతుంది.
అధిక బరువు (ఒబేసిటీ):
అధిక బరువు కలిగిన పురుషులలో శుక్రాణాల సంఖ్య తగ్గిపోతుంది. మితమైన వ్యాయామంతో బరువును నియంత్రించుకోవడం తప్పనిసరి.
ఒత్తిడి (Stress):
తీవ్రమైన ఒత్తిడి టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అధిక ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.
Also Read: Gold and Silver Rates Today: పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
మోకాళ్లపై ల్యాప్‌టాప్ ఉపయోగం:
ల్యాప్‌టాప్ వేడి శుక్రాణాల నాణ్యతను దెబ్బతీస్తుంది. 2024లోని పరిశోధన ప్రకారం, ల్యాప్‌టాప్ నుంచి విడుదలయ్యే ఎలెక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ డీఎన్‌ఏ నష్టానికి కారణం కావచ్చు.
ధూమపానం, మద్యం:
ధూమపానం, మద్యం శుక్రాణాల పరిమాణాన్ని ఇంకా వాటి నాణ్యతను తగ్గిస్తాయి. ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిని తగ్గించి, ఫర్టిలిటీ సమస్యలకు దారితీస్తాయి. ఈ అలవాట్లను మార్చుకుంటే సంతానోత్పత్తిపై ఉన్న ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు.