UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
- UPIపై MDR ఛార్జీల విధింపుపై కేంద్రం క్లారిటీ..
- వినియోగదారులపై ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Charges: ఇన్నాళ్లు ఫ్రీగా ఉన్న యూపీఐ లావాదేవీలపై ఇక ఛార్జీలు వసూలు చేస్తారనే చర్చ తీవ్రంగా సాగుతోంది. UPIపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీల విధింపుపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. MDR అమలులోకి వస్తే చిన్న వ్యాపారులు, కిరాణా దుకాణాలు, వీధి వ్యాపారులపై భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, దీనిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ (సవరణ) బిల్లు, 2026, యూపీఐ వినియోగదారులు, వ్యాపారులు త్వరలో ఛార్జీలను ఎదుర్కోవచ్చనే ఊహాగానాలకు దారితీసిన నేపథ్యంలో ఈ స్పష్టత వచ్చింది. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భవిష్యత్తులో ఏదైనా ఛార్జీలు విధించినా వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(PCI) ప్రకారం, UPI వినియోగించినందు యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీ వసూలు చేసే ప్రతిపాదన లేదని, అలాగే కిరాణా షాపులు, ఐస్ క్రీమ్ విక్రేతలు, చిన్న షాపుల వంటి వ్యాపారులు యూపీఐ ఉపయోగించినందుకు ఎండీఆర్ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. 2016లో ప్రారంభమైన యూపీఐ సేవలు ఉచితం కావడంతో వేగవంతంగా డిజిటల్ లావాదేవీలు విస్తరించాయి.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
MDR అంటే ఏమిటి.?
మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అనేది డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేసినందుకు వ్యాపారుల నుంచి బ్యాంకులు లేదా పెమెంట్ సర్వీస్ సంస్థలు వసూలు చేసే ఒక ఫీజు. సాధారణంగా ఇది వినియోగదారులు చెల్లించే ఛార్జీలు కావు. అయితే, వ్యాపారులపై ఎండీఆర్ భారం పెరిగితే డిజిటల్ చెల్లింపులు స్వీకరించడానికి వెనుకాడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు, ఈ ఎండీఆర్ ఛార్జీల ద్వారా పేమెంట్ మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల్ని డెవలప్ చేసేందుకు నిధులు సమకూరుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మర్చంట్ సర్వీస్ ఛార్జీలు అనేవి వ్యాపారులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య జరిగే వాణిజ్య ఒప్పందాలకు సంబంధించినవని PCI తెలిపింది.
There has been considerable discussion around UPI and merchant charges. Here are the facts behind the conversation what it means for consumers, merchants, and India's digital payment ecosystem.
1. Will I have to pay to use UPI?
No. UPI has always been free for consumers since…— PCI – Payments Council of India (@PCIUpdates) August 7, 2026
తాజావార్తలు
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!