Bhumana Karunakar Reddy: టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు..
- టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయి- భూమన
- ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారు అని కేంద్రం స్పందించింది- భూమన కరుణాకర్ రెడ్డి
- చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండపై అరాచకాలు పెరిగిపోయాయ- భూమన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాప ప్రక్షాళన చేస్తాను అని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కేంద్ర హోం శాఖ విపత్తుల నిర్వహణ శాఖ విచారణకు ఆదేశిస్తే, మీరు రద్దు చేయించారని తెలిపారు. ఆలయ పవిత్రతను సర్వనాశనం చేశారు అని కేంద్రం స్పందించింది.. విజయవాడకు అమిత్ షా వచ్చిన సందర్భంగా హడావిడిగా కేంద్రం బృందం పర్యటన రద్దు చేయించారు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. కంట్రోల్ రూమ్ నుంచి పర్యటన రద్దు చేస్తూ ప్రకటన చేశారని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. క్రౌడ్ మేనేజ్మెంట్‌కు సంబంధించి టీటీడీ నుంచి ప్రత్యేక బృందం అయోధ్య రామలయంకు పంపిన ఘనత తమదని అన్నారు. మీ పాలనలో టీటీడీ పరువు తీశారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొండపై అరాచకాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు.
Read Also: Amit Shah: అమిత్ షాను చూస్తే అసూయ కలుగుతుంది: సీఎం చంద్రబాబు
Also Read
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
దైవానికి జరుగుతున్న ద్రోహంగా ప్రజలు భావిస్తున్నారు.. తిరుమలలో బాలుడు మృతి చెందాడు, బిర్యానీ పొట్లాలు కొండపైకి వెళ్ళాయి, మద్యం కూడా కొండపై దొరికాయి.. సర్వ సాక్షి శ్రీ వేంకటేశ్వర స్వామిని మోసం చేయాలని చూస్తే శిక్ష తప్పదని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు పాపాల పుట్ట కొండగా మారిందని మండిపడ్డారు. పశువుల దొడ్డిలో తోచినట్లు క్యూలైన్‌లో తోచి పెట్టారు.. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్ పై చర్యలు తీసుకోకుండా జిల్లా ఎస్పీని బదిలీ చేశారని అన్నారు. టీటీడీ చైర్మన్‌కు టీడీపీ నాయకులు సేవలో తరిస్తున్నారని ఆరోపించారు. వైకుంఠ ఏకాదశికి సునీత గౌడ అనే కర్ణాటక భక్తురాలు.. రూ.70 లక్షలు ఖర్చు చేసి పుష్ప అలంకరణ చేస్తే బయట పెట్టేశారని అన్నారు. తిరుమలలో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తూ 4 సార్లు దొరికింది.. సనాతన ధర్మం కాపాడతా అంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు సంబంధించిన అటవీ శాఖలోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Read Also: Bollywood : 25 ఏళ్ల తర్వాత జోడీ కడుతున్న హిట్ పెయిర్
లడ్డు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పై బురద చల్లాలని చూశారు.. న్యాయ విచారణకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.. తిరుమల కొండపై అవినీతి ఏరులై పారుతోందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీడీపీ, జనసేన నాయకులు టికెట్ల అమ్ముకుంటూ సంపద సృష్టిస్తున్నారని అన్నారు. తిరుమలలో రాష్ట్రం సరైన చర్యలు తీసుకోక పోవడంతోనే కేంద్రం చర్యలు చేపట్టింది.. ఈ అపరాధాలకు శిక్ష తప్పదని భూమన ఆరోపించారు. మాడ వీధుల్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు.. అంటే మీ పర్యవేక్షణ ఏవిధంగా ఉందో అర్థం పడుతోందని దుయ్యబట్టారు. భయం, భక్తి లేకుండా పోయింది.. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ తొక్కిసలాటలో మృతి చెందిన 6 కుటుంబాలకు రూ.25 లక్షలు చంద్రబాబు ప్రకటన చేస్తే, టీటీడీ నుంచి నగదు ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!