వైకుంఠ ఏకాదశికి సిద్ధమవుతోంది తిరుమల.. ఇక, వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు టీటీడీ ఈవో శ్యామలరావు.. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్‌లో విడుదల చేస్తాం.. 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.