Kakinada Tension: కాకినాడలో టెన్షన్ టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనుమానస్పదంగా మృతి చెందడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఘటన జరిగి 48 గంటలు దాటిపోవస్తున్నా ఇంకా పోస్టుమార్టంకు కుటుంబ సభ్యులు ససేమిరా ఒప్పుకోవడం లేదు. సుబ్రహ్మణ్యం హత్య పట్ల కాకినాడ పట్టణంలో పలు పార్టీలకు చెందిన నాయకులు నిరసన తెలియజేస్తున్నారు. టీడీపీ నిజనిర్దారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే.
టీడీపీ నిజనిర్దారణ కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్ బాబు,ఎం.ఎస్ రాజు, పీతల సుజాత ,
పిల్లి మాణిక్యాలరావు వున్నారు. వీరు కాకినాడ చేరుకోవడం పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం దళితుల మీద దాడి చేస్తున్నారు. ఎమ్మెల్సీ పై అనర్హత వేటు వేయాలి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. ఘటనపై సి బీ ఐ విచారణ చేయాలి. ఎమ్మెల్సీ బోగస్ సర్టిఫికెట్ పొంది పదవి పొందాడు. మన్యం ప్రాంతాన్ని దోచుకుంటున్నాడు. 302 కింద కేసు పెట్టి అనంత బాబు ను అరెస్ట్ చేయాలి. దళితుడిని హత్య చేశాడన్నారు. మృతుడు సుబ్రహ్మణ్యం ఒంటిపై గాయాలున్నాయని సోదరుడు నవీన్ తెలిపారు. ఎమ్మెల్సీని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ఏ ధైర్యంతో డ్రైవర్ సుబ్మహ్మణ్యాన్ని చంపి కారులో తీసుకు వచ్చాడు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి, హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు మాజీ మంత్రి జవహర్. అనంత బాబు ను పదవి నుండి తప్పించాలి. జాతీయ స్థాయి లో ఈ విషయాన్ని తీసుకు వెళ్తామన్నారు. టీడీపీ నేత ఎం ఎస్ రాజు మాట్లాడుతూ.. కాకినాడ రౌడీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మృతుడు కుటుంబంతో రెండు కోట్లు ఇస్తామని బేర సారాలు చేస్తున్నాడు. యాక్సిడెంట్ గా ఒప్పుకోమని చెప్తున్నాడన్నారు. సెక్షన్ 174 ను 302 గా మార్చాలని, అనంత బాబు ను వెంటనే అరెస్ట్ చేయాలి. పోస్ట్ మార్డం జరగాలంటే ఎఫ్ ఐ ఆర్ లో సెక్షన్ లు మార్చాలి. పోలీసులకు అనంత బాబు ఎక్కడ ఉన్నాడో తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ ముద్దాయిలకు కొమ్ము కాస్తుందన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. మేము ఎంత వరుకు అయినా వెళ్తామన్నారు. ముద్దాయిని కాపాడ్డానికి పోలీసులు రాజకీయాలు చేస్తున్నారు. మరో వైపు పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. తోపులాటలో టీడీపీ నేత ఎంఎస్ రాజుకి అస్వస్థత కలిగింది. ఆయన్ని ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.డీఎస్పీ అప్పారావు కొట్టాడు అంటున్నారు టీడీపీ నేతలు.
అనంతబాబుని సీఎం ఎందుకు కాపాడుతున్నారని, ఎమ్మెల్సీని వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్నారు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!