Kubera : శేఖర్ కమ్ముల డైరెక్ష్మన్ లో వస్తున్న కుబేర మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇందులో నాగార్జున, ధనుష్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ధనుష్ పర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందులో రష్మిక పాత్ర కూడా చాలా కీలకం. పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది మూవీ. తాజాగా మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ బిచ్చగాడిగా నటించేందుకు ఎంత కష్టపడ్డాడో చూపించారు.
Read Also : Vijay Thalapathy : విజయ్ జననాయగన్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఈ వీడియోలో ఆయన నడిరోడ్డు పక్కన ఓ మూలన కూర్చోవడం.. అతని చేతిలో ఓ వీధి కుక్కను పట్టుకోవడం.. మాసిపోయిన బట్టలు, గుబురు గడ్డం, చెదిరిపోయిన జుట్టు.. ముఖం నిండా మసి పూసుకున్నట్టు ఆయన లుక్ ను చూస్తే ఎవరైనా ఇంత నేచురల్ గా చేయడానికి ఎంత కష్టపడ్డాడో అని అనుకోవాల్సిందే.
ఈ మూవీలో ధనుష్ ఎనిమిది గంటలు చెత్త కుప్పల్లో షూట్ చేశానని స్వయంగా చెప్పాడు. రష్మిక కూడా తనతో పాటే అదే చెత్త కుప్పల్లో షూట్ చేసిందని తెలిపాడు. ఇప్పుడు మేకింగ్ వీడియో చూస్తే వీరు ఎంత కష్టపడ్డారో అర్థం అవుతోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Mohanlal : మీరు మోహన్ లాల్ ఇంట్లో ఉండచ్చు.. ఎలానో తెలుసా?