సైలెన్స్ వీడిన ధర్మాన.. కేడర్ లో ఉత్చాహం.. ఇదే ఊపు కొనసాగిస్తారా.. మరలా సైలెంట్ మోడ్ లోకి జారుకుంటారా.. ఇదే అంశం నేడు జిల్లా పార్టీలో ఆశక్తికర చర్చగా మారిందట. ఇంతకీ ఎవరా నేత. వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా శ్రీకాకుళం జిల్లాలో అంతా తానై వ్యవహరించిన ధర్మాన ప్రసాద రావు…కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. ఈమధ్య మళ్లీ జిల్లా పార్టీ ప్రోగ్రామ్స్‌లో యాక్టివ్‌గా కనిపిస్తుండటంతో, అసలేం జరిగింది? మళ్లీ ఎందుకు యాక్టివ్…
Off The Record: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తలపండిన నేత ధర్మాన ప్రసాదరావు. ప్రత్యేకించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తనదైన మార్క్‌తో పాలిటిక్స్‌ను శాసిస్తూ వచ్చారాయన. 2024 ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నా…పార్టీ ఓటమి తర్వాత ఆయనలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. తనకు రాజకీయాల మీద ఆసక్తి పోతోందని ఎన్నికల సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దాంతో… ఒకవేళ తేడాపడితే… ఆయన పూర్తిగా పాలిటిక్స్ నుంచి తప్పుకుంటారా అన్న అనుమానాలు అప్పట్లోనే చాలామందికి…
Dharmana Prasada Rao: ప్రజల ఆరోగ్యం రాజ్యాంగ హక్కు అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రాథమిక బాధ్యతల నుంచి తప్పించుకుంటాం అంటే ఎలా?.. 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చాం.. కాలేజీతో పాటు హాస్పిటల్ అందుబాటులో ఉంది.. గవర్నమెంట్ చేయలేనిది ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు చేస్తారు.. ప్రైవేట్ వ్యక్తులు దోచుకోవడానికే చూస్తారని తెలిపారు.
కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. కూటమి పాలన అంటూ ఏమీ లేదు... ఆది కేవలం టీడీపీ పాలనే అన్నారు.. టీడీపీ వాళ్ల ఒక్కరి పైనే పాపం పడిపోకుండా.. కూటమి అని చెప్పుకుంటున్నారు.. కానీ, సమాజంలో ఉండే అట్టడుగు వర్గాల కోసం పని చేసే పార్టీ వైసీపీ మాత్రమే అన్నారు.
Dharmana Prasada Rao: చంద్రబాబు మ్యానిఫేస్టో అమలు చేయడని మన అందరికి తెలుసు అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఆ విషయం కార్యకర్తలు ప్రజలకు చెప్పాలి.. ప్రతిపక్షంలో ఉన్నవారు.. ప్రజలకు లోపాలను ఎత్తి చూపడానికి ప్రయత్నించాలి..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే కాదు.... మొత్తం ఏపీ పాలిటిక్స్‌లో పరిచయం అక్కరలేని పేరు ధర్మాన ప్రసారావు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేశారాయన. కాంగ్రెస్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీల్లో తనదైన మార్క్ రాజకీయాలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రి పదవిలో ఉన్న ధర్మాన... ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. ఏడాదిగా బయట ఎక్కడా కనిపించడం లేదాయన.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో సీనియర్స్‌కి కొదవేం లేదు. అదే... ఎక్కడికక్కడ ఆధిపత్య పోరుకు బీజం వేసిందన్నది పార్టీ నేతల మాట. వీరిని కట్టడం చేసేందుకు గతంలో ఇన్ఛార్జ్‌లుగా ఉన్న విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి వంటి నేతలు ప్రయత్నించేవారు. అభిప్రాయ తమ అనుభవాన్ని, పొలిటికల్ సీనియారిటీని ఉపయోగించి వేదికల మీద జరిగే గొడవల్ని నాలుగు గోడల మధ్యకు తీసుకురాగలిగేవారు.
ఆ సీనియర్ నేత తీరు సొంత పార్టీ నేతలకే అర్ధం కావడం లేదట. ఎన్నికల ఫలితాల వచ్చాక ఎవ్వరికీ అందుబాటులో లేరు సరికదా… ఇప్పుడసలు రాజకీయాల్లో ఉంటారా? లేక ఆల్రెడీ పెట్టేబేడా సర్దేసుకున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయి. సొంత కేడర్‌కు సైతం కనిపించడం లేదు, గతంలో తాను నిర్వహించిన శాఖపై తీవ్ర ఆరోపణలు వచ్చినా స్పందించడం లేదు. ఇంతకీ ఏంటాయన అంతరంగం? ఎవరా మాజీ మంత్రి? వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అంతరంగం ఏంటో అర్థంగాక…
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. అయితే, దేశవ్యాప్తంగా టైటిలింగ్ యాక్ట్ అమలులోకి వస్తే అప్పుడు ఆలోచిస్తాం అన్నారు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంపై ఘాటుగా స్పందించారు..