TSRTC: తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి.. ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. అంతే కాకుండా ఈ పండుగ సీజన్ లో రికార్డు స్థాయిలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు.
Cock fight: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి.. ఇక, సంక్రాంతి అనగానే ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు.. కోడి పందాలు, ఎద్దుల పోటీలు.. ఇలా అన్నీ జోరుగా సాగుతాయి.. కానీ, ఈ సారి కోడి పందాలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.. కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు మృతిచెందారు.. రెండు వేర్వేరు ఘటనల్లో కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. Read Also: Ajit Pawar: తృటిలో తప్పించుకున్నా.. లేకపోతే బ్రేకింగ్ న్యూస్…
Sankranti Wishes: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాజకీయ నేతలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవాత్మక ప్రగతి స్ఫూర్తితో యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగగా మారిన రోజున భారతదేశం సంపూర్ణంగా విప్లవాత్మకంగా మారుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని రైతులకు, ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర, దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని సూచించారు. పొలాల్లోని ధాన్యాలు తమ…
Goshala at CM YS Jagan House: తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నివాసం దగ్గర ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేశారు. హైందవ సంస్కృతితో గో పూజకు ప్రత్యేక స్థానం ఉండగా.. సీఎం నివాసంలో ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు అయ్యింది.. తెలుగుతనం ఉట్టిపడే డిజైన్లతో ఈ గోశాలను రూపకల్పన చేశారు.. గోవులు, గో పూజ అంటే ప్రత్యేక ఆసక్తి చూపించే ముఖ్యమంత్రి దంపతులు వైఎస్ జగన్, వైఎస్ భారతి.. రేపు గోపూజలు పాల్గొనబోతున్నారు.. ముఖ్యమంత్రి జగన్…
CM YS Jagan: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ సంతరించుకుంది.. ఇప్పటికే పట్నం వీడి పల్లె బాట పడుతున్నారు తెలుగు ప్రజలు.. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి తరలివెళ్తున్నారు.. దీంతో, రోడ్లు, రైల్వేస్టేషన్, విమానాలు.. అన్నీ రద్దీగా మారిపోయాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్.. సంక్రాంతి పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఎలాగైనా.. ఎన్ని కష్టాలు భరించైనా సొంత ఊరికి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు తెలుగు ప్రజలు.. దీంతో, పండు సీజన్‌లో విమానాలు, రైళ్లు, బస్సులు.. ఇలా ఏవి ఆశ్రయించినా ప్రయాణికుల రద్దీ ఉంటుంది.. దీంతో, సొంత వాహనాల్లో కూడా ఊరికి వెళ్లేవారు ఉన్నారు.. అయితే, సంక్రాంతి పండుగకు మరో 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే… ఇప్పటికే సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది…
'వాల్తేరు వీరయ్య' సినిమాటోగ్రాఫర్ ఆర్థర్ ఎ విల్సన్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లులో తడిపేశారు. ఆయన క్రాఫ్ట్ మ్యాన్ షిప్ ను అప్రిషియేట్ చేస్తూ ఏకంగా ఓ లెటర్ రాశారు!
పండుగలు వచ్చాయంటే చాలు.. ప్రత్యేక సర్వీసులను నడపడం.. ఇదే సమయంలో చార్జీలను భారీగా పెంచి క్యాష్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే.. ఈ సమయంలో అందినకాడికి దోచుకుంటాయనే విమర్శలు ఉన్నాయి.. అయితే, సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రావాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ).. జనవరి 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అన్ని ప్రాంతాలకు సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది.. ఇదే…