Pawan Kalyan and Somu Veerraju: జనసేనపై కుట్ర.. కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేనపై కుట్ర చేస్తున్నారు.. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.. ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించామని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న పవవన్ కల్యాణ్‌ను నోవాటెల్ హోటల్‌లో కలిసిన ఆయన.. విశాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై, ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు ఆ తర్వాత ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు ఇద్దరు నేతలు.. తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేతలకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖలో నిన్నటి ఘటన పూర్తిగా ప్రభుత్వ కుట్రగా భావిస్తున్నామని అన్నారు. సన్నాసులు ఏదో వాగుతారని, వారి గురించి పట్టించుకోనవసరంలేదని అభిప్రాయపడ్డారు. విజయనగరంలో బీజేపీ కార్యకర్తలపై నుంచి వైసీపీ దాడి ప్రారంభమైందన్న పవన్.. ప్రతిపక్ష పార్టీలు నేతలపై దాడులతో భయ పెడుతున్నారు.. జనసేన నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టారు.. నిన్న ఘటన పూర్తిగా ప్రభుత్వం కుట్రగా భావిస్తున్నాం అన్నారు.
Read Also: Income Tax Raids: నెల్లూరులో ఐటీ దాడుల కలకలం..
Also Read
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
ఇక, సోము వీర్రాజు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ యాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో ఆందోళన కలిగించే అంశం అన్నారు. జనసేనాధిపతిగా అనేక కార్యక్రమాలు, పర్యటనలు చేపట్టారు.. వైసీపీవారు వారికి వారిగా ఒక ఉద్యమం చేస్తున్నారు.. వాళ్ల కార్యక్రమానికి స్పందన రాకపోవడంతో జనసేనపై కుట్ర చేశారు ఆరోపించారు.. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.. ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించామన్నారు సోమువీర్రాజు.. వారు కూడా వైసీపీ ప్రభుత్వం దుశ్చర్యలపై పోరాడాలని సూచించారని.. రాష్ట్ర ప్రభుత్వం దమన చర్యలపై పోరు ఉమ్మడిగా సాగిస్తాం అన్నారు.. విశాఖ గర్జన రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్ ప్రోగ్రాంగా విమర్శించిన సోము వీర్రాజు.. జన స్పందన లేక పోవడంతో కుట్రకు తెర లేపారు.. ఇక నుంచి ఇటువంటి వాటిని అడ్డుకుని తీరుతాం అన్నారు. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయి అనేది ప్రచారం మాత్రమే అన్నారు సోము వీర్రాజు..
తాజావార్తలు
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!