నెల్లూరు నగరంలోని పలు బంగారం దుకాణాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వ్యాపారానికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. విజయవాడ, గుంటూరు నుంచి 40 మంది అధికారులు ఏక కాలంలో నెల్లూరు సిటీలోని 15 ప్రాంతాలపై దాడులు నిర్వహించారు.. రికార్డులను పరిశీలించి, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.. కాగా, మరోవైపు ఇవాళ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంబీఎస్ జ్యువెల్లర్స్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఎంబీఎస్ జ్యువెల్లర్స్‌తో పాటు ముసదిలాల్ జెమ్స్‌లో సోదాలు జరిగాయి.. అయితే, గతంలోనే ఎంబీఎస్ జ్యువెల్లర్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది.. రూ.504 కోట్ల అక్రమాలపై కేసు నమోదు చేసిన ఈడీ.. ఇప్పటికే రూ.363 కోట్ల ఆస్తులను కూడా అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
Read Also: Perni Nani: ఇది సినిమా కాదు వైసీపీ.. అట్టుకు 10 అట్లు, వాయినానికి 10 వాయినాలు పెడతాం..!