Somireddy Chandramohan Reddy: సోమిరెడ్డిని 3 గంటలు విచారించిన సీబీఐ.. అంతా కాకాని పుణ్యమేనన్న మాజీమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somireddy Chandramohan Reddy Fires On Kakani Govardhan Reddy After CBI Interrogation: నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్స్ చోరీ అయిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్న సీబీఐ అధికారులు.. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డిని మూడు గంటల పాటు విచారించారు. ఇదివరకే ఆయన్ను ఈ కేసులో నెల్లూరు జిల్లా కార్యాయలంలో విచారించగా, తాజాగా మళ్లీ ప్రశ్నించారు. ఈసారి న్యాయవాదితో పాటు విచారణకు హాజరైన సోమిరెడ్డి.. ఈ సందర్భంగా ఆయన పెన్ డ్రైవ్‌తో పాటు తొమ్మిది డాక్యుమెంట్లను అధికారులకు అందించారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ సూచించింది. మరో వారంలో పిలుస్తామని, లిఖితపూర్వకంగా సమాధానాలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Married Woman Molested: రుణం ఇప్పిస్తానన్నాడు.. బైక్ ఎక్కగానే షాకిచ్చాడు
Also Read
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
సీబీఐ విచారణ ముగిసిన అనంతరం మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ.. మరోసారి తనని సీబీఐ అధికారులు విచారించారని తెలిపారు. పెన్ డ్రైవ్‌తో పాటు తొమ్మిది డాక్యుమెంట్లను అందించానన్నారు. కాకానికి గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన డాక్యుమెంట్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇచ్చానన్నారు. కాకాని పుణ్యమా అని.. తనకు సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యే అవకాశం కలిగిందని సెటైర్ వేశారు. మరో వారంలో మళ్లీ పిలుస్తామని, లిఖితపూర్వకంగా సమాధానాలను తీసుకుంటామని అధికారులు చెప్పారన్నారు. గతంలో చంద్రమోహన్ రెడ్డి మీద సీబీఐ, ఈడీల వద్దకు వెళ్తానని కాకాని చెప్పారని.. ఇప్పుడు సీబీఐ తన మీద కేసు పెట్టిందని అన్నారు. కాకాని ఎప్పుడూ నిజం చెప్పడని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. ఈ కేసులో కాకాని పాపం తప్పకుండా పండుతుందని ఉద్ఘాటించారు. పరునష్టం దావాకు సంబంధించి తాను వేసిన రెండు కేసులు త్వరలోనే విచారణకు వస్తాయని.. ఆయన చేసిన మోసాలకు దేవుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు.
America: భారీ సాంకేతిక లోపం.. అమెరికా అంతటా నిలిచిన విమానాలు
కోర్టులో జరిగిన దొంగతనం కేసు కూడా చాలా కీలకంగా మారుతుందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. కోర్టులో ఒక రాజకీయ వేత్త దొంగతనం చేయించడం సంచలనంగా మారిందన్నారు. రాజకీయ ప్రత్యర్థైన తన మీద తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని.. కాకాని రూపొందించిన డాక్యుమెంట్లకు సంబంధించిన పెన్ డ్రైవ్‌ను సీఎం జగన్‌కి కూడా పంపిస్తానని అన్నారు. దాన్ని చూసి, కాకానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తాను కోరుతున్నానన్నారు. తాను పెట్టిన మూడు కేసుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు ఇంత దిగజారి కుటుంబాలను నాశనం చేసేందుకు తప్పుడు పత్రాలు విడుదల చేయకుండా చూస్తామని సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్‌ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!