ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చేందుకు.. పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘నాడు-నేడు’ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఇప్పటికే చాలా పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి.. మరికొన్ని స్కూళ్లలో పనులు జరుగుతున్నాయి.. కానీ, కర్నూలు జిల్లాలో పాఠశాల కంట్రాక్టర్ నిర్లక్ష్యంతో గోడ కూలి టీచర్, విద్యార్థులకు గాయాలయ్యాయి. అయితే, టీచర్ అప్రమత్తతతో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. జిల్లాలోని కౌతాళం మండలం హాల్వీ ఎలిమేంటరీ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది..
Read Also: Disha Patani: మేడమ్ మీ డ్రెస్ చాలా చోట్ల చిరిగింది, టైలర్ ని మార్చండి
హాల్వీ ఎలిమేంటరీ స్కూల్‌లో నాడు నేడు పనులు చేస్తూండగా.. ఒక్కసారిగా పాఠశాల గోడ కూలింది.. ఈ ప్రమాదంలో టీచర్ సుజాత, తొమ్మిది మంది విద్యార్థులు గాయపడ్డారు.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..అయితే, స్కూల్ గోడ జేసీబీతో కూల్చే ప్రయత్నంలో కాంట్రాక్టర్.. విద్యార్థులు ఉన్న తరగతి గది గోడ కూల్చినట్లు స్థానికులు చెబుతున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే విద్యార్ధుల ప్రాణం మీదకి తెచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.. టీచర్ సుజాత అప్రమత్తతతో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పిందంటున్నారు స్థానికులు.. ఈ ఘటనలో టీచర్, విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.