సంక్రాంతి సంబరాల్లో అనేక పోటీలు నిర్వహిస్తున్నారు.. సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు, ఎడ్ల పందాలులు చాలా ఫేమస్.. ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో ఇవి పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కూడా చూసిచూడనట్టుగా వ్యవహరించిన సందర్భాలే ఎక్కువని చెబుతారు.. అయితే, ఈ సారి కోడి పందేలు, ఎడ్ల పందాలకు భిన్నంగా.. పందుల పోటీలు నిర్వహించారు.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారు ప్రాంతం ఈ…
టాలీవుడ్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంక్రాంతి వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో తన సోదరి, కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఇంట్లో ఘనంగా జరుపుకుంటున్నారు.. నిన్న భోగి వేడుకల్లో సందడి చేసిన బాలయ్య.. సంక్రాంతి సందర్భంగా ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపారు.. ఇక, బాలయ్య గుర్పంపై స్వారీ అందరినీ ఆకట్టుకుంది.. గుర్రంపై బాలయ్య కూర్చొని ఉండగా.. ఆ గుర్రంతో డ్యాన్స్ వేయించారు.. ఓ పాటను పాడుతూ.. డ్రమ్స్ వాయిస్తుండగా..…
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది.. ఉద్యోగాల కోసం, బతుకుదెరువు కోసం కన్నఊరిని విడిచి ఇతర పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలకు తరలివెళ్లినవారు అంతా సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు.. ఇదే సమయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి రవాణా సంస్థలు.. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడుపుతోన్న ఏపీఎస్‌ఆర్టీసీ కూడా.. 50 శాతం అదనపు వడ్డింపు తప్పదని స్పష్టం చేసింది.. అయితే, దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.. అసలే ప్రజలు కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సంక్రాంతి పండగ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఓవైపు సర్కార్, పోలీసులు నిఘా పెడుతున్నా కోడి పందాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.. పని చేస్తున్న ప్రాంతాన్ని వదిలి.. సొంత ఊరికి పరుగులు పెడుతున్నారు.. దీని కోసం ప్రత్యేక రైళ్లు, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఇక, సంక్రాంతి పండుగ నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా పండగకు అవసరమైన సరుకులను కూడా పంపిణీ చేస్తూ ఉంటుంది సర్కార్.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా రేషన్…