కోవిడ్‌ ఎఫెక్ట్‌… ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు

కరోనా మళ్లీ కల్లోలం సృష్టిస్తోంది.. క్రమంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. అప్రమత్తమైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షల బాట పట్టాయి.. ప్రజలు ఎక్కువగా గుమిగూడే అవకాశం లేకుండా.. ఆంక్షలు విధిస్తున్నాయి.. ఇక, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది ఢిల్లీ సర్కార్.. కోవిడ్​పాజిటివ్‌ కేసులు అమాంతం పెరిగిపోతోన్న తరుణంలో అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం.. మరోవైపు, జమ్ములోనూ ఇలాంటి పరిస్థితే వచ్చింది.. అక్కడ వైద్య సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Read Also: జ‌న‌వ‌రి 6, గురువారం దిన‌ఫ‌లాలు…

అన్ని విభాగాల్లోని అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేయడమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగులు అంతా తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీలోని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం… అత్యసరమైతే తప్ప సెలవులు పెట్టొద్దని స్పష్టం చేసింది.. దేశ రాజధానిలోని ఒకే రోజు కోవిడ్​పాజిటివ్‌ కేసుల సంఖ్య రెట్టింపు కావడం, పాజిటివిటీ రేటు ఏకంగా 11.88కి చేరిన నేపథ్యంలో తగినంత సిబ్బంది అవసరమని భావిస్తున్న ప్రభుత్వం.. అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు విధులకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని పేర్కొంది. కోవిడ్‌ నియంత్రణ చర్యల కోసం ప్రభుత్వ రంగంలోని వివిధ విభాగాల్లో పలు స్థాయిల్లో సిబ్బంది భారీగా అవసరం. అందువల్ల అత్యవసరమైతే తప్ప అన్ని విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని.. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇవి అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది ఢిల్లీ ప్రభుత్వం.. కాగా, కరోనా కట్టడి కోసం నైట్‌ కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌ లాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నా.. క్రమంగా కేసులు పెరిగిపోతూ ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles