Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో మైనార్టీల సంక్షేమం టాప్ గేర్‌లో నడుస్తోంది.. మూడున్నరేళ్లలోనే ఆ ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లి వేదికగా జరిగిన వైసీపీ ముస్లిం మైనార్టీ సదస్సు నిర్వహించారు.. ముస్లిం మైనార్టీ వ్యవహారాల మంత్రి, డిప్యూటీ సీఎం అంజాద్ బాష , మైనారిటీ వర్గ ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. మైనార్టీలకు అండగా నిలబడి సంక్షేమపాలన అందించిన నేత సీఎం వైఎస్ జగన్ అన్నారు.. గత ప్రభుత్వాలు చేయలేనంతగా మైనార్టీలకి మేలు చేసిన అంకెలు ఇపుడు కన్పిస్తున్నాయి.. నేరుగా డిబిటి రూపంలో కానీ.. గృహ నిర్మాణరూపంలో కానీ లబ్దిదారులకి నేరుగా మేలు జరిగేలా అమలు చేస్తున్నాం అన్నారు.. కుటుంబ భవిష్యత్ ని తీర్చిదిద్దేలా వైసీపీ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.. ఈ పథకాలతో రాష్ట్ర స్వరూపమే మారబోతోందన్నారు. ఏ ప్రభుత్వ సహాయంచేసినా ఎక్కువ అవసరం ఉంది ముస్లిం.. మైనార్టీలకే.. ఏపీలో టాప్ గేర్ లో మైనార్టీల సంక్షేమం ఉందన్నారు సజ్జల.
Read Also: Bandla Ganesh: బండ్ల గణేష్ ఇన్ డైరెక్ట్ కౌంటర్లు.. ఎవరికో కొంచెం చెప్పండయ్యా
4.5 లక్షల మందికి అమ్మ ఒడి, 2.5 లక్షలమంది ఉన్నత విద్య, ఇలా 21 వేలకోట్లకి పైబడి మైనార్టీలకి ఈ మూడున్నరేళ్లలో మేలు జరిగిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కేవలం డిబిటి ద్వారానే 10771 కోట్లు మైనార్టీలకి ఇచ్చాం.. రాష్ట్రంలో 87 శాతం మందికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందన్న ఆయన.. దివంగత సీఎం వైఎస్సార్ తీసుకొచ్చిన 4 శాతం రిజర్వేషన్లతో మైనార్టీలకి ఎంతో మేలు జరుగుతోందన్నారు. వైఎస్సార్ సిపి డిఎన్ ఎ లోనే ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనార్టీలున్నారు. కానీ, ఏపీలో సీఎం వైఎస్ జగన్ సంక్షేమ యజ్ఞం ఆగిపోవాలని ప్రతిపక్షాలన్నీ ఏకమై కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినా క్యాలండర్ ప్రకారం సంక్షేమ పథకాలని సీఎం అమలు చేస్తూనే ఉన్నారన్న ఆయన.. సీఎం పాలనవల్ల రాబోయే అయిదారేళ్లలో మీ బ్రతుకులు మీరే నిర్ణయించుకునే స్ధితికి మారతాయని వెల్లడించారు.
Read Also: K.A.Paul: ఆరోజు సచివాలయం ఓపనింగ్ వద్దు.. హైకోర్టులో పాల్ పిల్
ఇక, సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలనని జనంలోకి తీసుకెళ్లాలని మైనార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇది కేవలం నాయకుల సమావేశం.. బహిరంగ సభ కాదు.. కార్యకర్తల సమావేశం కూడా కాదన్న ఆయన.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించామన్నారు.. వైఎస్సార్ సిపితోనే మైనార్టీల భరోసా, భద్రత.. చంద్రబాబు లాంటి నేతల మాయమాటలు నమ్మవద్దని సూచించారు. ముస్లిం, మైనార్టీల పేటెంట్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీగా అభివర్ణించారు. మైనార్టీలకి వైఎస్సార్ సిపి చేసిన మేలుని ప్రజలకి తెలియచెప్పాలని సూచించారు. పార్టీ పునః నిర్మాణం జరుగుతోంది.. గృహ సారథుల నియామకంతో మైక్రో లెవల్ కి వెళ్తున్నాం.. అబద్ధపు ప్రచారాలని వెంటనే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.