Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదాన్ని నెత్తిమీద వేసుకొనే బండ్ల గణేష్ గత కొన్నిరోజుల నుంచి ట్విట్టర్ లో ఎవరికో ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తున్నాడు. కొన్ని సార్లు తల్లిదండ్రుల మీద ప్రేమ చూపించాలి అంటాడు.. ఇంకొన్నిసార్లు పవన్ దేవుడంటాడు.. ఒకసారి రాజకీయాలలో లేను అంటదు.. ఇంకోసారి రాజకీయాల గురించి మాట్లాడుతూ తన అబిప్రాయమంటాడు. అసలు బండ్లన్న ఎవరికి కౌంటర్ వేద్దామని ఇదంతా చేస్తున్నాడు. తాను బాధపడుతున్నట్లు ఎవరికి ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు.. అనేది అభిమానులకే కాదు నెటిజన్లుకు కూడా అర్ధం కాకుండా ఉంది. ఇక తాజాగా బండ్లన్న వేసిన ట్వీట్ మాత్రం ఎవరికో గట్టిగా కౌంటర్ ఇచ్చినట్లే అనిపిస్తోందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
“ఎలుక రాతిదైతే పూజిస్తాం.. ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిదైతే పాలు పోస్తాం.. ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రుల ఫోటోకు దండేసి దండం పెడతాం. ప్రాణాలతో ఉన్నప్పుడు పట్టించుకోము, చనిపోయిన వారికి భుజాలు అందిస్తాం. బ్రతికున్నప్పుడు గేటు దగ్గరకు వస్తె అపాయింట్ మెంట్ కుడా ఇవ్వం. రాయిలో దైవత్వం ఉందనీ తెలుసుకున్నాం.. మనిషిలో మానవత్వం ఉందనీ గుర్తించలేక పోతున్నాం.. జీవంలేని వాటిపై ఉన్న ప్రేమ, భక్తీ.. ప్రాణాలతో ఉన్నప్పుడు ఎందుకు ఉండదో? ఒకసారి ఆలోచించుకోండి..” అంటూ రాసుకొచ్చాడు. అసలు బండ్లన్న ఇప్పుడెందుకు ఈ వేదాంతం చెప్పడం మొదలుపెట్టాడో అర్ధం కావడం లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇంకొందరు ఒక అగ్ర హీరోను ఉద్దేశించే ఈ మాటలు చెప్పుకొచ్చాడు.. ముఖ్యంగా చనిపోయిన వారికి భుజాలు అందిస్తాం. బ్రతికున్నప్పుడు గేటు దగ్గరకు వస్తె అపాయింట్ మెంట్ కుడా ఇవ్వం అనేది ఆ హీరో కు కౌంటరే అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఆ హీరో ఎవరో కొంచెం చెప్పండయ్యా అంటూ మిగతావారు అభ్యర్థిస్తున్నారు. ఇంకొందరు ఎందుకు బండ్లన్న నీకు ఇవన్నీ సైలెంట్ గా ఉండక అంటూ సలహాలు ఇస్తున్నారు.
ఎలుక రాతిదైతే పూజిస్తాం ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం
పాము రాతిదైతే పాలు పోస్తాం
ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం.
తల్లిదండ్రుల ఫోటోకు దండేసి
దండం పెడతాం.ప్రాణాలతో ఉన్నప్పుడు పట్టించుకోము,
చనిపోయిన వారికి భుజాలు అందిస్తాం.బ్రతికున్నప్పుడు
గేటు దగ్గరకు వస్తె అపాయింట్ మెంట్ కుడా ఇవ్వం— BANDLA GANESH. (@ganeshbandla) February 2, 2023
రాయిలో దైవత్వం ఉందనీ తెలుసుకున్నాం.. మనిషిలో
మానవత్వం ఉందనీ గుర్తించలేక పోతున్నాం..
జీవంలేని వాటిపై ఉన్న ప్రేమ, భక్తీ.. ప్రాణాలతో ఉన్నప్పుడు ఎందుకు ఉండదో? ఒకసారి ఆలోచించుకోండి..— BANDLA GANESH. (@ganeshbandla) February 2, 2023