K.A.Paul: తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో కెఏ పాల్ పిల్ దాఖలు చేశారు. తెలంగాణ నూతన సచివాలయం కేసీఆర్ పుట్టినరోజు ప్రారభించడాన్ని సవాలు చేస్తూ కెఏ పాల్ హైకోర్టులో పిల్ వేశారు. ఏప్రిల్ 14 న అంబేద్కర్ పుట్టినరోజు నాడు నూతన సచివాలయం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నూతన సచివాలయంకు అంబేద్కర్ పేరు పెట్టిన కేసీఆర్ అంబేద్కర్ పుట్టినరోజు నాడు సచివాలయం ప్రారంభించాలని పిల్ దాఖలు చేశారు. ప్రతి వాదులుగా సీఎంఓ, చీఫ్ సెక్రటరీలను చేర్చారు. పార్టీ ఇన్ పర్సన్ గా కె ఏ పాల్ వాదనలు వినిపిస్తామని తెలిపారు.
Read also: Bandisanjay-Revanthreddy: ఇక్కడ మాటల తూటాలు.. ఢిల్లీలో షేక్ హ్యాండ్ లు
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 6వ అంతస్తులో సీఎం ఛాంబర్, సీఎంఓ, అధికారుల ఛాంబర్స్, కేబినెట్ లను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రమే పరేడ్‌గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. బీజేపీ సభకు మించి.. అత్యధికంగా జనాన్ని సమీకరించి తమ బలాన్ని ప్రదర్శించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఖమ్మంలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ విజయవంతమైందని, మలి సభను అంతకుమించి సక్సెస్ చేయాలని భావిస్తున్న పార్టీ నాయకత్వం.. ఆ దిశగా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో బీఆర్‌ఎస్ సభకు ప్రాధాన్యం కల్పించాలన్న ఉద్దేశంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు సమాచారం. పశ్చిమబెంగాల్ సీఎం మమతతో పాటు మరో ముఖ్యమంత్రిని, ఇతర రాష్ట్రాల మాజీ సీఎంలు, ముఖ్య నేతలను సంప్రదించారని తెలుస్తోంది. అయితే.. జనవరి 24న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు కొత్త సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించిన విషయం తెలిసిందే..
Formula E: ఫిబ్రవరి 11, 12న ఫార్ములా ఈ రేసింగ్.. ఎన్‌టీఆర్ మార్గ్ పూర్తిగా క్లోజ్