IAS Transfers : తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. మొత్తం ఎనిమిది మంది అధికారులను కొత్త పదవులకు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలతో అభివృద్ధి, సంక్షేమం, రవాణా, గురుకుల విద్య, అర్బన్ డెవలప్మెంట్ వంటి విభాగాల్లో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సభ్యసాచి ఘోష్‌ను ప్రభుత్వం నియమించింది. గురుకుల సంక్షేమ శాఖ కమిషనర్‌గా అనితా రామచంద్రన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రవాణా…
Bhatti Vikramarka : తెలంగాణ గౌరవాన్ని దేశ స్థాయిలో నిలబెట్టేందుకు యువత కృషి చేయాలని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్రానికి బలమైన మానవ వనరులు (Human Resource) అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సివిల్స్ – 2025 మెయిన్స్ కు ఎంపికైన 178 మంది అభ్యర్థులకు రూ.1…
కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్... 665 పేజీల నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు అధికారుల కమిటీ దాన్ని పూర్తిగా స్టడీ చేసి 60 పేజీల సారాంశాన్ని క్యాబినెట్‌కు అందించింది. అయితే ఈ అరవై పేజీల నివేదికలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల పేర్లు మాత్రమే ప్రస్తావించి వారు సక్రమంగా విధులు నిర్వర్తించ లేదని స్పష్టం చేసింది.
Aarogyasri CEO : ఆరోగ్యశ్రీ ఇంచార్జీ సీఈవో గా మరోసారి ఐఏఎస్ అధికారి కర్ణన్ నీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఆరోగ్యశ్రీ విభాగంలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు రావడంతో నిన్నటి వరకు ఉన్న ceo శివ శంకర్ ని జిఏడీ కి అటాచ్ చేసింది తెలంగాణ సర్కార్.. నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కోఆర్డినేటర్లను నియమించారంటూ ఆరోపణలు వచ్చాయి.. జిల్లా కోఆర్డినేటర్ల నియామకానికి లక్షల్లో చేతులు మారినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆరోగ్యశ్రీ సీఈవోగా…
Madhu Yaskhi Goud : తెలంగాణ రాజకీయ వర్గాల్లో మరోసారి అధికారుల తీరుపై చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ప్రభుత్వం పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించగా, అధికారంలో ఉన్న కొన్ని కీలక విభాగాల్లో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అడ్డుగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై సున్నితమైన సమాచారాన్ని లీక్ చేస్తున్నారు అని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో పెత్తనం చేసిన అధికారులు ఇంకా…
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఐఏఎస్ అధికారులు ఎంతో కట్టుదిట్టంగా పని చేసేవారని, కానీ ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత అధికారి వర్గం కేవలం ఏసీ గదుల్లోనే పరిమితం అయ్యారని, ప్రజలకు అందుబాటులో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఐఏఎస్…
IAS Officers Transfer: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సోమవారం నాడు అర్థరాత్రి సీఎం కార్యదర్శి సహా 42 మంది ఐఏఎస్ అధికారులను కేంద్ర సర్కార్ ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ కుమార్, సాల్మన్ ఆరోక్య రాజ్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఈ ఇద్దరు అధికారులకు ముఖ్య కార్యదర్శి హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్ కుమార్ ను రీడిజిగ్నెట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ కి ఒక ఆసక్తికరమైన విజ్ఞప్తి వచ్చింది. అదేంటంటే తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్లు కొత్తగా ఒక మినీ థియేటర్ కట్టించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి ఫిలిం ఛాంబర్ కి ఒక విజ్ఞప్తి వచ్చింది. అదేంటంటే తమ కోసం కొత్త సినిమాలను ఫ్రీగా ఆ మినీ థియేటర్లో వేయాలని కోరారు. సాధారణంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా కలిసి సంబరాలు…
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్ ను ప్రత్యేక అధికారి గా నియమించింది.