Posani Krishna Murali: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయనపై చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందర పాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఈరోజు (మార్చ్ 6) ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఇంకా పీటీ వారెంట్లు జారీ చేయలేదని న్యాయస్థానానికి ఏపీ సర్కార్ తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు.
Read Also: ATLEE : అట్లీ- సల్మాన్ ఖాన్ సినిమాపై ఇంట్రస్టింగ్ బజ్
కాగా, పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 30 కంప్లైంట్స్ ఆధారంగా.. 16 కేసులు నమోదు అయినట్లు సమాచారం. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లను దూషించారంటూ టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన శ్రేణులు ఫిర్యాదులు చేయడంతో ఈ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 28న రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ పేరుతో అతడ్ని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఆపై పీటీ వారెంట్ల మీద నరసరావుపేట, కర్నూల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, ఉద్దేశపూర్వకంగా ఒక్కో జిల్లా తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోసాని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.