ఎర్రచందనం పేరు చెబితే పోలీసులు ఉలిక్కిపడతారు. స్మగ్లర్లు ఏ చోటునుంచి ఎక్కడికి అక్రమ రవాణా చేస్తున్నారో అర్థం కాక తలలు పట్టుకుంటారు. కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమార్కులపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక నిఘా ఉంచి ఎర్రచందనం రవాణాను అడ్డుకట్టవేస్తున్నారు. ఈక్రమంలో తొమ్మిది మంది అంతర్ జిల్లా ఎర్రచందనం స్మగ్లర్ల ముఠాను కడప పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 49 ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో పట్టుబడిన ఇద్దరు పాత నేరస్తులపై పిడి యాక్టు ప్రయోగిస్తున్నట్లు ఎస్పీ కేకే అన్బురాజన్ వెల్లడించారు.
Read Also:Woman Killed By Grandson: సినిమా స్ఫూర్తితో.. నానమ్మను కిరాతకంగా చంపిన మనవడు
కడప జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్టేషన్ల పరిధిలో ఎర్రచందనం నరికివేత, అక్రమ రవాణాకు పాల్పడుతున్న సుమారు 191 మందిని అరెస్టు చేశారు. వీరిలో తరచూ ఇదే నేరాలకు పాల్పడుతున్న ఏడుగురు అంతర్జాతీయ స్మగ్లర్లపై పిడి యాక్టు ప్రయోగించారు. తాజాగా మరో తొమ్మిది మంది అంతర్ జిల్లా ఎర్రచందనం స్మగ్లర్లను ఎర్రచందనం టాస్క్ పోర్సు పోలీసులు, ఒంటిమిట్ట పోలీసుల ప్రత్యేక బృందం అరెస్టు చేసింది. రెండు కార్లు, రెండు మోటారు బైక్‌లు, ఏడు సెల్ ఫోన్లు, సుమారు ఒకటిన్నర టన్ను బరువున్న 49 ఎర్రచందనం దుంగలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన స్మగ్లర్లలో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన మల్లేష్, రాజారెడ్డిలు పలు కేసుల్లో పట్టుబడినా ఇంకా ఇదే నేరాలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరిపై పిడి యాక్టు కింద చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ కెకే అన్సురాజన్ మీడియాకు వివరించారు. ఎవరైనా ఎర్రచందరం అక్రమ రవాణా, నరికివేతకు పాల్పడితే వారిపై పిడి యాక్టు కింద కేసు నమోదు చేయడంతో పాటు వారి ఆస్తులను కూడా రికవరీ చేస్తామని హెచ్చరించారు. తాజాగా ప్రొద్దుటూరుకు చెందిన ఫకృద్దీన్ అనే ఎర్రచందనం స్మగ్లర్‌పై పిడి యాక్డు ప్రయోగిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న టాస్క్ ఫోర్సు సిబ్బందిని, జిల్లా అడిషనల్ ఎస్పీ తుషార్, ఒంటిమిట్ట పోలీసులను ఆయన అభినందించారు.
Read Also: Urvashi Rautela: పాక్ క్రికెటర్‌తో రీల్.. ఏకిపారేసిన నెటిజన్స్