కరోనా కారణంగా వాయిదా పడ్డ నుమాయిష్‌ను ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ కొనసాగనుంది. ఇందుకోసం అన్ని శాఖల నుంచి అనుమతులు మంజూరైనట్లు తెలుస్తోంది. ఈమేరకు స్టాళ్ల నిర్వాహకులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకవేళ స్టాళ్ల నిర్వాహకులు సిద్ధంగా లేకపోతే ఫిబ్రవరి 25 నుంచి నుమాయిష్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల నుంచి అనుమతులపై రెండురోజుల్లో…
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 20న విశాఖలో పర్యటించనున్నారు. ఈనెల 20న భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖ చేరుకోనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆయన నేరుగా నౌకాదళ అతిథి గృహానికి వెళ్లనున్నారు. ఈనెల 21న నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలో పాల్గొంటారు. తిరిగి ఈనెల 22న ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్…