YS Sharmila: APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడలో ఏపీలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలపై కూటమి ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ అని పేర్కొనడం సిగ్గుచేటుతో కూడినదని, ప్రజలకు ఇవ్వాల్సిన వాగ్దానాలు పూర్తిగా అమలులోకి వచ్చాయని చెప్పడం హాస్యాస్పదమని ఆమె పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలలో ఒక్కటైనా పూర్తిగా అమలు అయ్యిందా? రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులలో ఒక్కరికి కూడా 3,000 రూపాయల భృతి అందించిందా? కూటమి…
CM Chandrababu: రాష్ట్ర ప్రభుత్వ సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రజల స్పందనపై పార్టీ వర్గాలతో సిఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకంపై పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ర్యాలీలు, కార్యక్రమాలపై సిఎం సమీక్ష నిర్వహించారు. అలాగే ఉచిత బస్సు పై అన్ని ప్రాంతాల్లో అద్భుత స్పందన వస్తోందని చంద్రబాబుకు పార్టీ విభాగాల ప్రతినిధులు వివరించారు. అంతేకాకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ తో వైసీపీ అంతర్మథనంలో పడిందని, దీంతో…
Gudivada Amarnath: యోగాంధ్రను చంద్రబాబు తన పబ్లిసిటీ కోసమే చేసినట్లు కనిపించింది తప్ప.. ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడలేదు అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేకుండా ప్రజలను గాలికొదిలేసారు.
Buggana Rajendranath: ఏపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభ కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బుగ్గన నేడు హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారు. ఈ సందర్బంగా బుగ్గన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. చంద్రబాబును ఎవరు ప్రశ్నించినా ఉపేక్షించరనీ ఆయన మాటలు వింటే అర్థం అవుతుంది.. అది ప్రజలైన కూడా ఆయన ఉపేక్షించరని విమర్శించారు. ప్రజలు ఎన్నికల…
జగన్ ఒక రంగుల రెడ్డి, జగన్ వి చీప్ పాలిటిక్స్.. తల్లిని, చెల్లిని మోసం చేసింది జగన్ అని మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చారని... గత 5 ఏళ్లలో దళితులపై దాడులు ఎలా చేశారో చూశామన్నారు.. జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రౌడీ షీటర్ లను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమేనన్నారు.
Ravindranath Reddy: కడప జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ముఖ్య నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా “వెన్నుపోటు దినం”గా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని కారణంగా ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలిపారు. జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలకు…
కూటమి ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఉన్న సూపర్ సిక్స్ పథకాలపై సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్.. కూటమి ప్రభుత్వంపై మన ప్రశ్న - వారి సమాధానం.. తల్లికి వందనం ఎప్పుడు? జవాబు.. మీకు 11 సీట్లు.. ప్రతి మహిళకు నెలకు 1500/- ఎప్పుడు? జవాబు మీకు 11 సీట్లు.. ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల భృతి ఎప్పుడు? జవాబు మీకు 11 సీట్లు..
సూపర్ సిక్స్ అన్నాడు.. అయితే ఇప్పుడు అది సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కడప వైసీపీ జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.
ఎన్నికల సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఉద్యోగాల నుంచి తొలగిస్తోందని.. 410 మంది ఉద్యోగులను ఫైబర్ నెట్ నుంచి తొలగిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇస్తాం అని చెప్పిన భృతి ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.