ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న రొయ్యల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. అమెరికా సుంకాల పేరుతో గంటల వ్యవధిలో రొయ్యల రేట్లు తగ్గించిన ప్రాసెసింగ్ యూనిట్ల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పాలకొల్లు జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పాలకొల్లు, నర్సాపురం, ఆచంట, నిడమర్రు, గణపవరం తూర్పుగోదావరి జిల్లాల రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా సాయం అందించేందుకు సిద్ధంగా వుందన్నారు అగ్రికల్చర్ స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభించాం. 26 రకాల పంటలకు బీమా సౌకర్యం ఉందన్నారు పూనం మాలకొండయ్య. పంటల బీమా ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందన్నారు. ఈ-క్రాప్ విధానం ద్వారా పంట అంచనా, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఐదేళ్లలో రెట్టింపు సంఖ్యలో రైతులకు బీమా సౌకర్యం విస్తరించాం అని చెప్పారు. అన్ని…
ఏపీ వ్యసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి టీడీపీ, జనసేన అధినేతలపై విరుచుకుపడ్డారు. కోనసీమలో క్రాప్ హాలీడే గురించి ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు రాష్ట్ర ప్రజలు రాజకీయ హాలీడే ఇచ్చారని ఎద్దేవా చేశారు. వీళ్ళు క్రాప్ హాలీడే అని దుష్ప్రచారం చేస్తున్నారు.సీఎం పై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నవరత్నాల్లో మొదటి హామీ రైతు భరోసా. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతు ఉద్యమాలు చేస్తే అణచి వేశారు. కరువు మండలాలు టీడీపీ హయంలోనే ఎక్కువగా…
కోనసీమ క్రాప్ హాలీడే పాపం వైసీపీదే అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతాంగంపట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్లే పంట విరామ నిర్ణయం తీసుకుంటున్నారన్నారు. కోనసీమ రైతులకు అండగా జనసేన.వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, చేసిన తప్పిదాలు వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో ఈ రోజు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరు.కాలువలు, డ్రెయిన్ల మరమ్మత్తులు, పూడిక తీత, గట్లు పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపడం లేదన్నారు పవన్…
సాగు సమస్యలు పరిష్కారం కాక … అష్ట కష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఈ ఖరీఫ్ లో క్రాప్ హాలీడే పాటిస్తే కనీసం పెట్టుబడి డబ్బులు అయినా మిగులుతాయని కోనసీమ వరి రైతులు పంట విరామానికే మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. క్రాప్ హాలీడేకి సిద్ధమవుతున్న రైతుల ఆలోచన ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా.. మంత్రి విశ్వరూప్ చేసిన తాజా వ్యాఖ్యలు వివాదానికి కారణం అవుతున్నాయి. కోనసీమ జిల్లాలో క్రాప్ హాలీడే రైతులపై రాష్ట్ర…