రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా.. తెలుగు ప్రజలకు భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా సాయం అందించేందుకు సిద్ధంగా వుందన్నారు అగ్రికల్చర్ స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభించాం. 26 రకాల పంటలకు బీమా సౌకర్యం ఉందన్నారు పూనం మాలకొండయ్య. పంటల బీమా ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందన్నారు. ఈ-క్రాప్ విధానం ద్వారా పంట అంచనా, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఐదేళ్లలో రెట్టింపు సంఖ్యలో రైతులకు బీమా సౌకర్యం విస్తరించాం అని చెప్పారు. అన్ని…
2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. జనంలోకి వెళ్ళేందుకు యాత్రలతో బీజేపీ నేతలు బిజీ అవుతున్నారు. ఇప్పటికే రెండు ప్రజాసంగ్రాయాత్రలు చేశారు బండి సంజయ్. తెలంగాణలో మరో విడత ప్రజా సంగ్రామయాత్రకు రెడీ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోంది. తెలంగాణలో ఆత్మహత్యలే లేవన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ వక్రభాష్యాన్ని చూసి…
అప్పుల ఊబిలో ఉన్న రైతులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు పెట్టుబడి ఇస్తామన్న హామీ ఏమైంది? రైతు ఉసురు తీసుకొనే పరిస్థితి రాకుండా వ్యవస్థలు పని చేయాలి. రాష్ట్రంలో నిత్యం ఏదొక ప్రాంతంలో అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత విషాదకరం అన్నారు పవన్. ఇటీవలే పల్నాడు, కర్నూలు నంద్యాల జిల్లాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బాధిత రైతుల కుటుంబాలకు ప్రగాఢ…
ఏపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతుల సమస్యలు పరిష్కరించలేని వ్యవస్థలు ఉండి ఏం లాభం?గుంటూరు జిల్లాకు చెందిన సన్నకారు రైతు ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్యతోనైనా రెవెన్యూ శాఖలో మార్పు రావాలి. తనకున్న 1.64 సెంట్ల వ్యవసాయ భూమి వివరాలను తప్పుగా నమోదు చేయడమే కాకుండా.. తప్పును సరిదిద్దడానికి నాలుగేళ్ల పాటు తిప్పుకోవడం దారుణం అన్నారు పవన్. Read Also: CM Jagan: గృహనిర్మాణ శాఖపై కీలక సమీక్ష రెవెన్యూ వ్యవస్థ తీరుతో…
అనంతపురం జిల్లా మన్నీల రచ్చబండ లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను రైతు నేపథ్యం నుంచి వచ్చా… రైతు కష్టం తెలిసిన వాడిని.కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఆదరణ లేక… గిట్టుబాటు కాక నిరాశ నిస్పృహ లో ఆత్మహత్య కు పాల్పడుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే కన్నీళ్లు తుడవలేని ప్రభుత్వాలు ఉంటే ఏంటి… లక్షల కోట్లు ఉంటే ఏమి లాభం? కౌలు రైతు, రైతులకు కులం ఉండదు. ఒకప్పుడు నేను ఇంటర్ లో బాగా…
సాగు నష్టాలు,ఆర్ధిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కలుగురి రామకృష్ణ కుటుంబాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు.అనంతపురం జిల్లాధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో ఆయన ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చారు.