ప్రతి ఎమ్మెల్యే నెలకు ఒక రోజు రైతుల దగ్గరకు వెళ్లి సమస్యలు తెలుసు కోవాలన్నారు సీఎం చంద్రబాబు. వచ్చే నెల నుంచి రైతులకు సంబంధించి తక్షణ కార్యాచరణ ప్రారంభిస్తాం అని ప్రకటించారు. తాను ఐటీపై మాట్లాడితే ఐటీ వ్యక్తి అనుకుంటారని, కానీ రైతుల కోసమే ఎక్కువ ఆలోచిస్తా అన్నారు సీఎం. వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం అని, రైతుల నికర ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నాం అని…
ఆదాయం వచ్చే పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అరటి, మిరప, మామిడి, పూలు, టమాటో, బత్తాయి, ఆయిల్‌పామ్, మిరియాలు, నిమ్మ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. వచ్చే ఐదేళ్లలో హార్టీకల్చర్‌ను 25 లక్షల హెక్టార్లకు పెంచేలా చర్యలు చేపట్టామని చెప్పారు. మరో పదేళ్లలో మహారాష్ట్ర, యూపీని అధిగమించి.. ఏపీ నెంబర్‌వన్ కావాలని ఆకాక్షించారు. రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారని సీఎం చెప్పుకొచ్చారు.…
సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై చర్చ జరిగింది. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఏపీ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా సాయం అందించేందుకు సిద్ధంగా వుందన్నారు అగ్రికల్చర్ స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభించాం. 26 రకాల పంటలకు బీమా సౌకర్యం ఉందన్నారు పూనం మాలకొండయ్య. పంటల బీమా ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందన్నారు. ఈ-క్రాప్ విధానం ద్వారా పంట అంచనా, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఐదేళ్లలో రెట్టింపు సంఖ్యలో రైతులకు బీమా సౌకర్యం విస్తరించాం అని చెప్పారు. అన్ని…