PMGKAY Scheme: ఏపీలో ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
pmgkay scheme free rice will distributed from august 1st in andhra pradesh
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద బియ్యం పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ బియ్యం పంపిణీ చేయకపోతే ధాన్యం సేకరణ నిలిపివేస్తామన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ హెచ్చరికల నేపథ్యంలో రేషన్ కార్డు దారులకు ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఉచిత బియ్యాన్ని జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) పరిధిలోని కార్డుదారులకే రేషన్ దుకాణాల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఏపీలో మొత్తం 1.45 కోట్ల రేషన్ కార్డు దారులు ఉండగా వీరిలో 88.75 లక్షల మందికే ఎన్ఎఫ్ఎస్‌ఏ కార్డులు ఉన్నాయి. దీంతో మిగిలిన 56.6 లక్షల మంది రేషన్ కార్డు దారులకు బియ్యం ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
Read Also: BJP MP Ravi Kishan: జనాభా నియంత్రణ బిల్లుపై రవికిషన్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజెన్లు
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
కాగా పీఎంజీకేఏవై పథకం కింద ఏపీలో ఏప్రిల్ నుంచి బియ్యం పంపిణీ జరగడం లేదు. దీంతో ఆగస్టు నెలతో కలుపుకుంటే ఐదునెలల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో కుటుంబ సభ్యుడికి నెలకు 5 కిలోల చొప్పున 5 నెలలకు 25 కిలోల బియ్యం పంపిణీ చేయాలి. ఒక కార్డులో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే 100 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. కేంద్రం భరించే రాయితీతో 5 నెలలకు సుమారు రూ.4వేలు విలువైన బియ్యం కార్డుదారులకు అందుతాయి. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలో లేని రేషన్ కార్డు దారులు ఈ మేరకు నష్టపోవాల్సి ఉంటుంది. అయితే పౌరసరఫరాల శాఖ వద్ద పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం నిల్వలు లేవని.. అందుకే కూపన్లు ఇచ్చి వాటిపై విడతల వారీగా ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని అధికారులు వివరిస్తున్నారు. కాగా పీఎంజీకేఏవై ఉచిత బియ్యం పంపిణీపై మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి సోమవారం పూర్తి వివరాలు చెప్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!