Pithani Satyanarayana: తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ.. అయితే, పవన్ కల్యాణ్ టీడీపీతో కలవడానికి ముందుకు వస్తుంటే.. భారతీయ జనతా పార్టీ మాత్రం భయపెడుతుందని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ తప్పుడు రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. టీడీపీతో జనసేన కలవకుండా.. బీజేపీ ఎంత కాలం అడ్డుకుంటుందో చూస్తామన్నారు పితాని. మరోవైపు.. రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ తెరవెనుక సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. రాష్ట్రానికి, దేశానికి బీజేపీ అవసరమా? అని ప్రజలు ప్రశ్నించే రోజు రాబోతుందన్నారు మాజీ మంత్రి పితాని సత్యనారయణ.
Read Also: YS Viveka Case: సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీత
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జనసేన, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతుండగా.. కొన్ని సందర్భాల్లో అసలు జనసేనతో పొత్తు ఉన్నా.. లేనట్టేనంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మరోవైపు.. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనే ఆలోచనలో పవన్ ఉన్నట్టుగా తెలుస్తుండగా.. దీనికి బీజేపీకి అంగీకరించకపోతే.. అవసరమైతే బీజేపీకి బైబై చెప్పేసి.. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు పవన్ కల్యాణ్ సుముఖంగా ఉన్నారట.. కానీ, బీజేపీ మాత్రం పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీతో వెళ్లకుండా అడ్డుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్న విషయం విదితమే.