Janasena: కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 8వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. శిరివెళ్లలో ఓ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. ఇదివరకే అన్నదాతకు అండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన రైతు భరోసా యాత్ర సమయంలోనూ పవన్ పలువురు రైతులకు ఆర్థికసాయం అందించారు. 41 మంది రైతులకు రూ. 1 లక్ష చెక్‌లను ఇచ్చారు. ఇప్పుడు మరోసారి కర్నూలు జిల్లా రైతులకు ఆర్థిక సహాయం అందించనున్నట్టు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
రాష్ట్రంలో అత్యధికంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది కర్నూలు జిల్లాలోనే అని, సుమారు 373 మంది కౌలు రైతులు గత మూడేళ్ళలో బలవన్మరణాలకు పాల్పడ్డారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ రైతు కుటుంబాలకి అందాల్సిన సాయం అందలేదని చెప్పిన నాదెండ్ల.. తొలి విడతలో భాగంగా 130 మంది కౌలు రైతులకు పవన్ సాయం చేయనున్నారని తెలిపారు. రెండో విడతలో మిగిలిన వారికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పవన్‌పై రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు చౌకబారు విమర్శలు మాని, రైతులకు సాయం అందించే పనిపై దృష్టి పెట్టమని ఆయన సూచించారు.
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- OTR: పెనుకొండ వైసీపీలో పీక్స్‌కు చేరిన వర్గపోరు
పవన్ కళ్యాణ్ ఈ రైతు భరోసా యాత్ర చేపట్టగానే.. ఆదరాబాదరాగా రైతు కుటుంబాల ఖాతాల్లో జగన్ ప్రభుత్వం రూ.లక్ష వేస్తోందని అన్నారు. నిజానికి.. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా వారికి రూ. 7 లక్షల సాయం అందాలని, ఆ డబ్బులు వారికి అందజేయాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. రైతు భరోసా యాత్రం రైతులకు కొండంత నమ్మకాన్ని కలిగిస్తుందన్న విషయాన్ని గ్రహించే.. వైసీపీ నేతలు చౌకబారు విమర్శలకు దిగుతున్నారన్నారు. రైతులకు అందాల్సిన పూర్తి సాయం అందేవరకూ.. జనసేన పోరాటం ఆగదని నాదెండ్ల క్లారిటీ ఇచ్చారు.
రైతుల ఆత్మహత్యలపై రాజకీయం చేయడం మాని.. అన్నదాతలకు ఎలా అండగా నిలవాలో, వారికి ఏ విధమైన తోడ్పాటు ఇవ్వాలన్న విషయంపై ఆలోచిస్తే మేలని బాధ్యతగల పదవుల్లో ఉన్నవారిని సూచించారు. సాగు నష్టాలు, రుణ భారంలో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని.. వారి భవిష్యత్తుపై భరోసా కల్పించడంలో జగన్ సర్కార్ విఫలమవుతోందని అన్నారు. ఇందుకు రైతుల ఆత్మహత్యలే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. రైతులు బలవన్మరణాలకు పాల్పడే స్థితికి వచ్చారంటే, వ్యవసాయ రంగంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్న విషయం అర్థమవుతోందన్నారు.
8వ తేదీన కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర#JanaSenaRythuBharosaYatra pic.twitter.com/KEwnfs5ecq
— JanaSena Party (@JanaSenaParty) May 2, 2022
తాజావార్తలు
-
Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!