Pawan Kalyan: ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు కోసం అక్రమంగా ఇళ్లను కూల్చివేయడంపై ఆయన ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం కూడా అర్థాంతరంగా అలా కూలుతుందని హెచ్చరించారు. వైసీపీకి అనుకూలంగా ఓటు వేసిన వారే తమవారని ప్రభుత్వం భావిస్తోందని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఓటు వేయని వాళ్లను ‘తొక్కి నార తీయండి’ అనే విధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని…