Pawan Kalyan Meets Muralidharan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో బిజీబిజీగా గడుపున్నారు.. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం అవుతున్నారు.. నిన్న సాయంత్రం పవన్ కల్యాణ్.. నాదెండ్ల మనోహర్ తో కలిసి ఏపీ బీజేపీ ఇంఛార్జ్ మురళీధరన్ తో సమావేశమయ్యారు. గంటన్నరపాటు ఈ భేటీ జరిగింది.. ఇక, ఈ రోజు మరోసారి మురళీధరన్‌తో సమావేశం అయ్యారు పవన్ కల్యాణ్.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు.. జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణ అంశాలపై ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది.. నిన్న సమావేశం ముగిసిన తర్వాతే కాదు.. ఈ రోజు కూడా.. ఇంకా పలువురిని కలవాల్సి ఉందని తెలిపారు పవన్ కల్యాణ్.. అందరినీ కలిసిన తర్వాత వివరాలు చెబుతాన్నారు.. అయితే, ఈ భేటీల్లో పొత్తులపై కీలకంగా చర్చ సాగుతున్నట్టుగా సమాచారం.. బీజేపీ మాత్రం జనసేనతో కలిసి వెళ్లాలని ఆలోచనతో ఉండగా.. పవన్ కల్యాణ్ మాత్రం.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ముందుకు నడుస్తూనే.. ఎన్నికల్లో విజయం సాధ్యమనే భావనలో ఉన్నారు.. ఆ దిశగానే ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు.
Read Also: Attar shops in Hyderabad: రంజాన్ మాసం.. భారీగా వెలసిన అత్తర్ విక్రయాలు
ఇక, ఈ రోజు మురళీధరన్‌తో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో పాటు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ శివ ప్రకాష్ పాల్గొన్నారు. దీంతో.. పొత్తులపై కీలక చర్చ జరిగిందనే ప్రచారం సాగుతోంది.. మరోవైపు.. ఢిల్లీ పర్యటనలో నిన్న రాత్రి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయిన పవన్.. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని.. కేంద్రమే ఆ బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.. మరోవైపు.. బీజేపీ పెద్దలతో ఇంకా సమావేశాలు ఉన్నాయని జనసేనాని చెబుతున్న నేపథ్యంలో.. సాయంత్రం బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.
Read Also: CM YS Jagan: రేపు ఒంటిమిట్టకు సీఎం జగన్.. పర్యటన వివరాలు ఇవే..
మొత్తంగా భవిష్యత్ కార్యాచరణపై పవన్ కల్యాణ్ సమాలోచనలు చేస్తున్నారు.. టీడీపీతో పొత్తుతో సహా అన్ని అంశాలపై క్లారిటీ కోసం మంతనాలు సాగిస్తున్నారు.. సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపై సమాలోచనలు సాగుతున్నాయి.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో గంట పాటు సమావేశమైన జనసేన నేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్.. పోలవరం ప్రాజెక్టు పై సుదీర్ఘంగా చర్చించారు.. ఇక, ఇవాళ బీఎల్ సంతోష్‌తో సమావేశం కానున్నారని తెలుస్తోంది.. జేపీ నడ్జా, అమిత్ షాలతో కూడా అవకాశాన్ని బట్టి సమావేశం కానున్నారు.. ఈ భేటీల్లో ముఖ్యంగ బీజేపీ అభిమతం, ఎన్నికలకు సమాయత్తం, రాజకీయ కార్యాచరణపై స్పష్టత కోరుతున్నారు జనసేన అధినేత.. అయితే, హస్తిన పర్యటనలో పొత్తులపై జనసేనాని ఎలాంటి వైఖరి తీసుకుంటారు.. బీజేపీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.