Pawan Kalyan: అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Interesting Comments On Tribal People: అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు, కల్లాకపటం ఎరుగని మనుషులు మన గిరిజనులని.. కొండకోనల్లో నివసిస్తూ సంప్రదాయాలను బతికించుకొంటున్నారని వ్యాఖ్యానించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా.. గిరిపుత్రులకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అటవీ ప్రాంతంలో అనువైన పంటలు పండించుకుంటూ.. చెట్టు చేమలు, సకల జీవాలను దైవసమానంగా చూసుకొనే జీవవైవిధ్య పరిరక్షకులని వారిని కొనియాడారు. గిరిజనుల జీవితాలు నిత్యం సవాళ్లతో కూడుకున్నవేనని.. విద్య, వైద్యం, శుభ్రమైన తాగునీరు వీరికి ఇప్పటికీ గగన కుసుమాలేనని ఆవేదన వ్యక్తం చేశారు.
Brazil: ఫ్లైట్ నడిపిన 11 ఏళ్ల బాలుడు.. మందుకొట్టిన తండ్రి.. ఇద్దరు మృతి
Also Read
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
కొండకోనలు దాటి రావడానికి ఇష్టపడని ఈ అడవి బిడ్డలకు అనారోగ్యం చేసినా, ప్రసవానికి ఆస్పత్రికి వెళ్ళాలన్నా ఆ బాధలు వర్ణనాతీతమని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. మంచానికి కర్రలుకట్టి వాగులు వంకలు దాటుకుంటూ ప్రయాసతో వారు ఆస్పత్రులకు వెళ్ళడం మనం ప్రసార మాధ్యమాలలో చూస్తూనే ఉన్నామన్నారు. ఆ దృశ్యాలు చూస్తే గుండె బరువైపోతుంటుందని.. ఈ పరిస్థితి మారాలని కోరారు. ఎంత వ్యయమైనా వారిని ఈ దుస్థితి నుంచి బయటపడేయాలని అన్నారు. గిరిజనుల బాగుకోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏ సంబంధిత విభాగాల్లో సేవా భావం కలిగిన వారిని నియమించి, ఆ వ్యవస్థను పటిష్టపరచాలని డిమాండ్ చేశారు. అత్యవసర ఆరోగ్య సమయాల్లో అడవిబిడ్డల కోసం ఎయిర్ అంబులెన్సుల ఏర్పాటుపై కార్యాచరణ చేయాలన్నారు.
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
ఆరు కిలోమీటర్ల పర్యటనకు హెలికాప్టర్ ఉపయోగిస్తున్నప్పుడు.. ఒక ప్రాణాన్ని కాపాడడానికి హెలికాప్టర్‌ను ఉపయోగించడం భారమైన పని కాదని పరోక్షంగా సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ కౌంటర్ వేశారు. అదే విధంగా గిరిజన బాలబాలికలకు విద్య అందుబాటులో ఉంచాలన్నారు. గిరిపుత్రులు వారు కోరుకున్న జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన కనీస అవసరాలను ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సూచించారు. గిరిజన లోకంలో చైతన్యం వెల్లివిరియాలని, వారు సుఖశాంతులతో జీవించాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు.
తాజావార్తలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!