Pawan Kalyan Gives Clarity On AP Volunteers Issue: తనకు వాలంటీర్ వ్యవస్థపై కోపం లేదని, అయితే ఈ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోలేదని జనసేనాధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వాలంటీర్లు లేనప్పుడు కూడా రేషన్ వస్తువుల పంపిణీ సజావుగానే సాగిందని, పంపిణీ ఎక్కడా ఆగిపోలేదని అన్నారు. తల్లిసాక్షిగా.. తనకు వాలంటీర్ల పొట్ట కొట్టాలని లేదన్నారు. జనవాణిలో భాగంగా.. తనకు వాలంటీర్లపై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని కొందరు పేరెంట్స్ ఫిర్యాదు చేశారన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం.. రాష్ట్రంలో 29,279 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు. ప్రతి యాభై ఇళ్ళ గుట్టు ఒకరి చేతిలో పెడుతున్నారన్నారు.
Fake Post: కోపంతో పోయాడంటూ పోస్ట్.. చివరిచూపుకోసం బారులు తీరిన బంధువులు
ఏలూరులోని దెందలూరు నియోజకవర్గ నాయకులు, వీరమహిళల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనకు ఎంతోమంది వందల కోట్లిస్తాం, వ్యాపారాలు చేసుకుందామని ఆఫర్లు ఇచ్చారని.. రాజకీయాలు వద్దు అని సూచించినవాళ్లు ఉన్నారని చెప్పారు. కానీ.. తాను రాజకీయాల్లో మార్పు కోసం జనసేన స్థాపించి, పదేళ్ల నుంచి నడిపిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. కేవలం వైసీపీ విధానాలపైనే తనకు చిరాకు ఉందన్నారు. నాయకులు చేసే తప్పులు ప్రజలపై పడతాయని.. వ్యక్తులు చేసే తప్పులు కులాలపై పడతాయని వివరించారు. మనవాడైనా సరే.. అతడు సరైనవాడో కాదో చూడాలని హితవు పలికారు. జగన్ మావాడేనని దళితులు అనుకుంటే, మొదటి దెబ్బ వారికే కొట్టారని మండిపడ్డారు.
Thaman : అలాంటి సమయంలో ఎలా వ్యవహరించాలో ధోనిని చూసి నేర్చుకున్నా..
పెగాసిస్ సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడుతున్నపుడు.. పర్సనల్ వివరాలు ఎందుకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అరగంట కాకపోతే పది గంటలు మట్లాడుకోండని.. జగన్ పబ్జీ ఆన్‌లైన్ గేమ్ ఆడుకున్నా అడ్డు చెప్పమని ఎద్దేవా చేశారు. కానీ.. పబ్లిక్ డబ్బులతో గ్యాంబ్లింగ్ ఆడితే మాత్రం తోలు తీస్తామని హెచ్చరించారు. డిబేట్‌ని తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ వ్యక్తిగత జీవితంపై డిబేట్స్ నడిపేవారు.. 30వేల మంది ఆడపడుచులు మిస్ అయ్యారంటే ఎందుకు డిబేట్ నడిపించరు? అని ప్రశ్నించారు. దానిపై డబ్బు రాదు కాబట్టే.. ఆ విషయం గురించి మాట్లాడరని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ గురించి మీకు కోపం వస్తుందంటే.. తప్పు జరుగుతుందన్నట్టేనని అభిప్రాయపడ్డారు.
Hero Ajith: అజిత్ మోసగాడు, నా డబ్బులు తిరిగివ్వలేదు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
సేవ చేసేందుకు వచ్చిన వాలంటీర్‌కు దాడిచేసే అవకాశం ఉందా..? ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసే హక్కు ఉందా..? అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. వ్యక్తిగతంగా మాట్లాడినా తాను ఎదురు చెప్పనన్నారు. డిబేట్‌ను పక్కదారి పట్టించడానికి వేసే ట్రాప్‌లో తాను పడనని అన్నారు. జగన్ ఎప్పుడూ ఫ్యాక్షనిస్ట్‌లతోనే గొడవ పెట్టుకున్నారని.. కానీ విప్లవకారుడితో గొడవ పెట్టుకొలేదని చెప్పుకొచ్చారు. ఓ విప్లవకారుడితో గొడవ పడితే ఎలా ఉంటుందో తాను చూపిస్తానని పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేశారు.