Hero Ajith: అజిత్ మోసగాడు, నా డబ్బులు తిరిగివ్వలేదు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Producer Manickam Narayanan Accuses Ajith Kumar of Cheating: హీరో అజిత్‌కుమార్ ఒక పెద్ద స్టార్ అయినప్పటికీ.. ఎంతో వినయంగా, డౌన్ టు ఎర్త్‌గా ఉంటాడని అంటుంటారు. కానీ.. అందరూ అనుకునేలా అజిత్ అలాంటివాడు కాదంటూ నిర్మాత మాణికం నారాయణన్ కుండబద్దలు కొట్టారు. అతడు ఒక మోసగాడు అని, తన వద్ద డబ్బులు తీసుకొని ఇంతవరకూ తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. ఓ స్థానిక మీడియాతో నారాయణన్ మాట్లాడుతూ.. ‘‘తన తల్లిదండ్రులను సెలవుపై మలేషియాకు పంపాలని, కొన్ని సంవత్సరాల క్రితం అజిత్ నా నుంచి డబ్బులు తీసుకున్నాడు. అప్పట్లో అతను నా కోసం ఒక సినిమా చేస్తానని, రెమ్యునరేషన్‌లో ఆ డబ్బును సర్దుబాటు చేస్తానని అతడు మాటిచ్చాడు. అయితే.. ఇప్పటివరకూ అతను నా డబ్బుని తిరిగి ఇవ్వకపోగా.. నా నిర్మాణంలో సినిమా కూడా చేయలేదు. ఇన్నేళ్లలో అతను దీని గురించే మాట్లాడటం మానేశాడు’’ అంటూ మండిపడ్డారు.
Balakrishna: లేడీ ఫ్యాన్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన బాలయ్య..
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
అజిత్ తనను తాను పెద్దమనిషిగా అనుకుంటాడని, కానీ అది వాస్తవం కాదని నిర్మాత మాణికం పేర్కొన్నారు. ఇప్పుడు అజిత్ ఒక స్టార్ హీరోగా ఎదిగాడని, ఒక్కో సినిమాకు రూ.50 కోట్లపైగానే సంపాదిస్తున్నాడని చెప్పారు. అంత డబ్బు సంపాదిస్తున్నప్పుడు, తన డబ్బు తనకు తిరిగి చెల్లించవచ్చు కదా అని నిలదీశారు. తనతో పాటు ఏఎమ్ రత్నం వంటి నిర్మాతలు సైతం.. అజిత్ చిత్రాలను నిర్మించడంతో భారీగా నష్టాలను చవిచూశామన్నారు. అతడు ఏనాడూ నష్టపోయిన నిర్మాతల్ని ఆదుకోవడానికి ముందుకు రాలేదన్నారు. కాగా.. నిర్మాత మాణికం ఇలా అజిత్‌తో ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన అజిత్‌కు 1996లో రూ.6 లక్షలు, 1998లో మరోసారి రూ.12 లక్షలు ఇచ్చానన్నారు. ఆ అంశాలను సైతం తాజాగా మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. మరోవైపు.. అజిత్ ఫ్యాన్స్ ఈ నిర్మాత మాటల్ని తోసిపుచ్చుతున్నారు. కేవలం తన కూతురి పెళ్లికి రాలేదన్న అక్కసుతోనే, ఆ నిర్మాత అజిత్‌పై ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నాడంటూ తెలుపుతున్నారు.
Wife: జాబ్ కోసం కష్టపడుతున్న భర్తలు.. రాగానే వదిలేస్తున్న భార్యలు
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!