CM Revanth Reddy: పౌల్ట్రీ రైతులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. 48 గంటల్లో కీలక నిర్ణయం!
- 48 గంటల్లో దానాపై నిర్ణయం
- సింగిల్ విండోలో అనుమతులు
- గ్రామాలకూ బిల్ట్ నౌ విస్తరణ
- పౌల్ట్రీ రంగానికి భూముల కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో–2026 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పౌల్ట్రీ రంగ అభివృద్ధి, రైతుల సమస్యల పరిష్కారంపై కీలక ప్రకటనలు చేశారు. ఈ వేడుకలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఈశ్వర్ కుమార్, రాజ్ కుమార్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు మాల్ రెడ్డి రాంరెడ్డి, శివసేనా రెడ్డి, పౌల్ట్రీ ఇండియా ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్ బయాస్ తదితరులు పాల్గొన్నారు.
సోయా, మొక్కజొన్న సరఫరాపై 48 గంటల్లో నిర్ణయం
ప్రతిరోజూ 5 కోట్ల 30 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని, ప్రభుత్వ హాస్టళ్లలో వారానికి మూడు గుడ్లు, చికెన్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అనుమతుల్లో జాప్యం, కోళ్ల దానా సమస్యలను నిర్వాహకులు తన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్న ఆయన, సంక్షోభ సమయాల్లో ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. మనుషులకు ఆహార కరువు లేదని, రెండేళ్లకు సరిపడా సన్నబియ్యంతో పాటు కేంద్రం వద్ద కూడా బియ్యం నిల్వలు ఉన్నాయని చెప్పారు. పౌల్ట్రీ రైతులకు సోయా, మొక్కజొన్న సరఫరా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై 48 గంటల్లో సమీక్ష నిర్వహించి నిర్ణయం ప్రకటించాలని మంత్రులను ఆదేశించారు.
Also Read
- Basara IIIT Student S*uicide: బాసర ట్రిపుల్ విద్యార్థి ఆత్మ*హత్యకు అసలు కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడి..!
- Weight Loss Injection: 'ఫ్యాట్ టూ ఫిట్' పేరుతో భారీ మోసం.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు..!
- Nasha Mukt Bharat: డ్రగ్స్‌కు నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి.. యువతకు హీరో వెంకటేష్ పిలుపు!
- Duddiilla Sridhar Babu : విమర్శలు పట్టించుకోం.. అభివృద్ధిలో తగ్గేదేలే
సింగిల్ విండో అనుమతులు.. బిల్ట్ నౌ యాప్ విస్తరణ
ఫ్యూచర్ సిటీలో బిల్ట్ నౌ యాప్ ద్వారా అనుమతులు ఇస్తున్నామని, త్వరలోనే ఈ విధానాన్ని గ్రామాలకు కూడా విస్తరిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎలాంటి ఆలస్యం లేకుండా సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్‌కు వందలాది కంపెనీలు రానున్న నేపథ్యంలో పౌల్ట్రీ రంగానికి కూడా భూమి కేటాయిస్తామని తెలిపారు.
పెట్టుబడులకు భద్రత.. పౌల్ట్రీకి ప్రాధాన్యత
సాంకేతిక నైపుణ్యం పెద్దగా లేకపోయినా వ్యవసాయ కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ, రైతుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే రంగం పౌల్ట్రీ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ యువతకు ప్రోటీన్ అందించే ఈ రంగంలో మార్కెట్ ఒడిదుడుకులు సహజమని, షేర్ మార్కెట్ లాగా పొద్దున్నే బాగుండి సాయంత్రం నష్టం వచ్చే పరిస్థితులు ఉండొచ్చని వ్యాఖ్యానించారు. గుడ్డు ధర తగ్గొచ్చని, బంగారం ధర కూడా తగ్గుతుందని అన్నారు. తెలంగాణలో ఐటీతో పాటు పౌల్ట్రీని కూడా ప్రాధాన్యత రంగంగా తీసుకుంటామని, పక్క రాష్ట్రాల్లోలా ఇక్కడ పాలసీ పరాలిసిస్ లేదని, పెట్టుబడులు పూర్తిగా భద్రంగా ఉంటాయని భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పౌల్ట్రీ రైతులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. 48 గంటల్లో కీలక నిర్ణయం!
-
Basara IIIT Student S*uicide: బాసర ట్రిపుల్ విద్యార్థి ఆత్మ*హత్యకు అసలు కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడి..!
-
Ramayana Record: రామాయణ వరల్డ్ రికార్డు.. బాహుబలి 2 రికార్డు బ్రేక్.. నెక్స్ట్ టార్గెట్..?
-
Chiranjeevi: ‘కాకా’ కూడా హిట్ పడితే ఇక చిరునే టాప్?
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. ఆస్తుల విచారణపై అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు రద్దు!
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!