AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సంచలనం రేపిన యువతి కళ్యాణి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కళ్యాణిని హత్య చేసింది ఆమెతో సన్నిహితంగా ఉండే మటన్ షాప్ నిర్వాహకుడు షఫీగా పోలీసులు గుర్తించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో మటన్ షాప్ నిర్వహించే షఫీతో కళ్యాణికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కళ్యాణి కుమారుడిని కూడా షఫీనే పెంచుతున్నట్లు దర్యాప్తులో తేలింది.
అయితే విలాసాలకు అలవాటు పడిన కళ్యాణి తరచూ డబ్బులు ఇవ్వాలని షఫీని ఒత్తిడి చేసేదని.. డబ్బులు ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానంటూ బెదిరించేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 17వ తేదీ రాత్రి 20 వేల రూపాయలు ఇవ్వాలని కళ్యాణి అడగడంతో… ప్రకాశం బ్యారేజ్ సమీపం నుంచి ఆమెను భవానీపురంలోని తన ఇంటికి తీసుకెళ్లిన షఫీ.. అక్కడ కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత తన మటన్ షాప్‌లో పనిచేసే గురువులు అనే వ్యక్తిని ఇంటికి పిలిపించాడు షఫీ. ఇద్దరూ మద్యం సేవించి… మటన్ కొట్టేందుకు ఉపయోగించే కత్తులతో కళ్యాణి మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
ఆ తర్వాత మృతదేహం ముక్కలను బ్యాగుల్లో పెట్టుకుని గొల్లపూడి వద్ద కూలింగ్ కెనాల్లో పడేసినట్లు దర్యాప్తులో తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా షఫీ, గురువులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కళ్యాణికి సన్నిహితులుగా ఉన్న బంగారు షాప్ దామోదర్, కరీం హోటల్ గోస్, ఆల్ఫా హోటల్ అదానీ అలీ పాత్రపైనా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ హత్య వెనుక మరెవరైనా ఉన్నారా..? మృతదేహాన్ని ముక్కలుగా చేయడంలో ఇంకెవరైనా సహకరించారా..? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!