Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nursing Home Seized: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఎంబీఎస్ సర్జికల్ అండ్ మెటర్నిటీ నర్సింగ్ హోమ్‌ను అధికారులు సీజ్ చేశారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు రోగులు మృతి చెందడంతో ఈ చర్యలు చేపట్టారు. ఆర్డీఓ కుమార్ ఆసుపత్రిని తనిఖీ చేసి, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొత్తగా పేషెంట్లను చేర్చుకోవద్దని, ఎలాంటి వైద్య చికిత్సలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల మైలవరం మండలం మొరుసుపల్లికి చెందిన బండారు కుమారి, తిరువూరుకు చెందిన డెంటల్ డాక్టర్ తాళ్ల దీప్తి ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీప్తి ప్రసవం కోసం ఆసుపత్రికి రాగా తీవ్ర రక్తస్రావం కారణంగా మృతి చెందినట్లు సమాచారం. అంతకుముందు కూడా ఓ మహిళ ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
- Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
వారం రోజుల్లోనే ఇద్దరు మృతి చెందడంతో మృతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి ఆసుపత్రిలోని సిబ్బంది, వైద్య సేవలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఘటనలపై పూర్తి నివేదిక ఇవ్వాలని వైద్యశాఖను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిని నిర్వహిస్తున్న డాక్టర్ రమేష్‌పై స్థానికులు పలు ఆరోపణలు చేస్తున్నారు. గతంలోనూ ఆయన వద్ద చికిత్స పొందిన కొందరు మృతి చెందిన ఘటనలు ఉన్నాయని వారు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఆపరేషన్లకు సంబంధించిన రికార్డులు, గతంలో చోటుచేసుకున్న ఘటనలు, వైద్యుడి విధులపై అధికారులు విచారణ చేపడుతున్నారు.
డాక్టర్ రమేష్ తెలంగాణలోని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వ వైద్యుడిగా విధులు నిర్వహిస్తూ తిరువూరులో ప్రైవేట్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారా? అనే అంశంపైనా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. డాక్టర్ రమేష్ నిర్వహించిన గత ఆపరేషన్లు, ఆసుపత్రి రికార్డులు, సిబ్బంది వివరాలు, గతంలో నమోదైన ఫిర్యాదులు తదితర అంశాలపై అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిని తాత్కాలికంగా సీజ్ చేసి, కొత్తగా ఎలాంటి రోగులను చేర్చుకోవద్దని ఆదేశించారు. విచారణ అనంతరం బాధ్యులపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!