Vaibhav Sooryavanshi: 50 బంతుల్లో డబుల్ సెంచరీ చేయొద్దు ప్లీజ్.. న్యూజిలాండ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jacob Oram Praises Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవలే 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ కుర్రాడు.. మంగళవారం జరిగిన లిస్ట్-ఏ మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌పై మాజీల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌తో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ జాకబ్ ఓరమ్ ఆసక్తికరంగా స్పందించాడు. కివీస్ బౌలర్లపై వైభవ్ పెను విధ్వంసం సృష్టించకూడదని సరదాగా వ్యాఖ్యానించాడు.
15 ఏళ్ల ఆటగాడిని వన్డే క్రికెట్‌ను కాపాడే రక్షకుడిగా అభివర్ణించడం తొందరపాటే అయినప్పటికీ.. వైభవ్ లాంటి ప్రతిభావంతులు క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తారని ఓరమ్ అభిప్రాయపడ్డాడు. టీ20 క్రికెట్‌ను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారని, సంప్రదాయ క్రికెట్ అభిమానులు టెస్టులను ఆదరిస్తున్నారని పేర్కొన్నాడు. అయితే 50 ఓవర్ల ఫార్మాట్‌కు కూడా క్రికెట్లో ప్రత్యేక స్థానం ఉందని తాను ఇప్పటికీ నమ్ముతున్నట్లు తెలిపాడు. వైభవ్ ఆటతీరును ప్రశంసించిన ఓరమ్.. అతడు ఎంతో ఉత్సాహంగా, వినోదాత్మకంగా ఆడతాడని అన్నాడు. ఇలాంటి ఆటగాళ్లు క్రికెట్లో ఎక్కువగా ఉండటం ఆటకు మంచిదని పేర్కొన్నాడు. అయితే తమ జట్టు బౌలర్లపై మాత్రం 50 బంతుల్లో డబుల్ సెంచరీ చేయకూడదు అని సరదాగా వ్యాఖ్యానించాడు.
Also Read
- Hardik Pandya: 'చివరికి, ఆమె నాది'.. మహికా శర్మకు రింగ్ తొడిగిన హార్దిక్ పాండ్యా?.. నిశ్చితార్థంపై జోరుగా ప్రచారం
- Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!
- Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!
- Vaibhav Sooryavanshi: పదాలు సరిపోవడం లేదు.. తరానికొక్కడు.. ప్రత్యేకమైన ప్లేయర్.. వైభవ్‌పై ప్రశంసల వర్షం!
భారత్‌తో రెండో టెస్టు శుక్రవారం నుంచి క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ పిచ్‌తో పోలిస్తే ఇక్కడ పేస్, బౌన్స్, బంతి కదలిక ఎక్కువగా ఉండనుంది. అయితే మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉందని ఓరమ్ పేర్కొన్నాడు. పిచ్ పరిస్థితులపై తుది నిర్ణయం మొదటి రోజు ఆట ప్రారంభమయ్యే సమయానికి తీసుకుంటామని తెలిపాడు. వాతావరణం, ఉష్ణోగ్రత, గాలి ప్రభావం, పిచ్ ఎండిపోయే తీరు వంటి అంశాలను పరిశీలించిన తర్వాత బౌలింగ్ వ్యూహాలను ఖరారు చేస్తామని వివరించాడు. ఈసారి అయినా టాస్ గెలవాలని ఆశిస్తున్నామని సరదాగా చెప్పాడు.
హాగ్లీ ఓవల్ పిచ్‌పై పచ్చికను చూసి బ్యాటింగ్ చాలా కష్టమని భావించాల్సిన అవసరం లేదని ఓరమ్ సూచించాడు. న్యూజిలాండ్‌లో సాధారణంగా మంచి పిచ్‌లు ఉంటాయని, మొదట్లో పచ్చగా కనిపించినా అవి త్వరగా ఎండిపోయి బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతాయని వివరించాడు. వెల్లింగ్టన్ టెస్టులో తొలి రోజు భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ, ఆ తర్వాత పిచ్ పూర్తిగా ఫ్లాట్‌గా మారిందని గుర్తుచేశాడు. గత ఏడాది హాగ్లీ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టును ఓరమ్ ఉదాహరణగా ప్రస్తావించాడు. ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్ చివరి రోజు మొత్తం బ్యాటింగ్ చేసి డ్రా చేసుకోగా.. జస్టిన్ గ్రీవ్స్ డబుల్ సెంచరీ సాధించాడు. మొదట్లో పిచ్ కఠినంగా కనిపించినా.. ఆ పరిస్థితులను అధిగమిస్తే ఆ తర్వాత బ్యాటింగ్ సులభమవుతుందని తెలిపాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 50 బంతుల్లో డబుల్ సెంచరీ చేయొద్దు ప్లీజ్.. న్యూజిలాండ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
CM Revanth Reddy: పౌల్ట్రీ రైతులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. 48 గంటల్లో కీలక నిర్ణయం!
-
Basara IIIT Student S*uicide: బాసర ట్రిపుల్ విద్యార్థి ఆత్మ*హత్యకు అసలు కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడి..!
-
Ramayana Record: రామాయణ వరల్డ్ రికార్డు.. బాహుబలి 2 రికార్డు బ్రేక్.. నెక్స్ట్ టార్గెట్..?
-
Chiranjeevi: ‘కాకా’ కూడా హిట్ పడితే ఇక చిరునే టాప్?
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!