Nuzvidu: నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాల్లో కలపాలని ఉద్యమాలు..
- నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాల్లో కలపాలని పెద్దఎత్తున ఉద్యమాలు..
- జిల్లాల విభజనలో భాగంగా ఏలూరులో కలిసిన నూజివీడు..
- అక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నామంటున్న జనం..
- ఎన్నికల ముందు చంద్రబాబు హామీని గుర్తు చేస్తున్న న్యాయవాదులు..
- జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలను...
- అమరావతి జిల్లాలో కలిపే ప్రతిపాదనలపై ఆసక్తికర చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nuzvidu: జిల్లాల విభజన సమయంలో మూడు జిల్లాలుగా రూపాంతరం చెందింది ఉమ్మడి కృష్ణా జల్లా.. వాటిల్లో మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి మూడు పార్లమెంట్ సెగ్మెంట్లు కూడా ఉన్నాయి. విజయవాడ పార్లమెంటును ఎన్టీఆర్ జిల్లాగా, మచిలీపట్నం పార్లమెంటును కృష్ణా జిల్లాగా మార్చారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలను ఏలూరు జిల్లాలో కలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడలోని మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో గన్నవరం, పెనమలూరు, పామర్రు, గుడివాడ, పెడన, అవనిగడ్డ, మచిలీపట్నం ఉన్నాయి. అయితే ఇక్కడే సమస్య మొదలైంది. ఉమ్మడి కృష్ణ జిల్లాగా ఉన్న సమయంలో విజయవాడను ఆనుకొని ఉన్న గన్నవరం, పెనమలూరు నియోజకవర్గం రెవెన్యూ పనులకు సంబంధించి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చేవారు. ఏ పని కావాలన్నా, అటు విద్యాపరంగా.. వాణిజ్యపరంగా విజయవాడే వాళ్లకి ప్రధాన కేంద్రంగా ఉండేది.
Read Also: New Liquor Shops: తెలంగాణలో కొత్త మద్యం షాపులు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..
Also Read
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్‌స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
అయితే గన్నవరం, పెనమలూరు రెండు నియోజకవర్గాలు మచిలీపట్నం పార్లమెంటుగా ఏర్పడిన కృష్ణా జిల్లాలో కలిశాయి. దీంతో రెవెన్యూ, కలెక్టర్, ఇతర ప్రభుత్వ పనులకు పక్కనే ఉన్న విజయవాడకు కాకుండా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గన్నవరం పెనమలూరు నియోజకవర్గం ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను తిరిగి ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇటు ఏలూరు జిల్లాలో కలిపిన నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాల్లో కలపాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నామంటున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. నూజివీడుని ఏలూరులో ఉంచడం వల్ల నష్టమేంటి? ఎన్టీఆర్ జిల్లాలో కలిపితే లాభమేంటనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లామని చెబుతున్నారు. లేకపోతే మరింత వెనుకబడి పోతామని న్యాయవాదులు అంటున్నారు. ఈ ఉద్యమం ఎవరికీ వ్యతిరేకం కాదని చెబుతున్నారు.
ఇదే సమయంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలను కొత్తగా అమరావతి జిల్లాలో కలిపే ప్రతిపాదనలపై కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల సమస్యపై పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఏం నిర్ణయిస్తుందో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!