Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- విజయవాడ కలెక్టరేట్‌లో సంచలనం
- NTR జిల్లా ప్రజా పరిష్కార వేదికలో ఘటన
- అనాసాగరం గ్రామానికి చెందిన మల్లంపూడి లక్ష్మీ తులసి అధికారిపై కారం చల్లిన ఘటన
- భూ వివాదం పరిష్కారం కాలేదన్న ఆగ్రహంతో ఈ చర్య
- నందిగామ మండలంలో భూమి పరిహారం విషయంలో అసంతృప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోని ప్రజా పరిష్కార వేదికలో అధికారులపై ఓ వృద్ధురాలు కారం చల్లిన ఘటన కలకలం రేపింది. నందిగమ్మ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మల్లంపూడి లక్ష్మీ తులసి భూ సమస్య పరిష్కారం కాలేదన్న కోపంతో కలెక్టరేట్లో గ్రీవెన్స్ సమయంలో అధికారిపై కారు చెల్లింది. దీంతో ఆమె సమస్య చర్చకు వచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు వెంటనే అనాసాగరం గ్రామానికి వెళ్లి భూమిని పరిశీలించారు. నందిగామ ఎంఆర్ఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో సర్వే అధికారులు స్థలాన్ని కొలిచి వివరాలు సేకరించారు. సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం తీసుకొని పరిష్కారం చూపిస్తామని ఎంఆర్ఓ హామి ఇచ్చారు.
CM Chandrababu: అమరావతిలో భారత్ తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీకి శ్రీకారం చుట్టిన సీఎం..!
Also Read
- KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
- Uttam Kumar Reddy: "రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం".. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
- Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
- Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
జాతీయ రహదారి పక్కన తనకు 8 1/2 సెంట్ల స్థలం ఉండేదని 2003లో రహదారి విస్తరణలో 50మీటర్ల భూమి వెళ్ళిపోయిందని వృద్ధురాలు తెలిపింది. ఆ తర్వాత 2017లో నందిగామ బైపాస్ రోడ్ విస్తరణ సమయంలో మరింత స్థలం పోయిందని చెప్పింది. ప్రస్తుతం తన దగ్గర 4 సెంట్లు మాత్రమే మిగిలిందని చెప్తోంది. ఈ భూమికి సంబంధించి 2023లో ఆమెకు 6.5 లక్షలు మాత్రమే జమయ్యాయని పక్కనున్న వారికి అదే తరహా భూమికి 24 లక్షలు ఇచ్చారని వృద్ధురాలు ఆరోపిస్తుంది. తనకు రావలసిన పూర్తి పరిహారం ఇవ్వాలని లేదా మిగిలిన స్థలం స్పష్టంగా చూపించాలని ఆమె డిమాండ్ చేసింది.
గతంలో అనేకసార్లు స్థానిక అధికారులను సంప్రదించిన సమస్య పరిష్కారం కాలేదని అంటుంది. కలెక్టరేట్ చుట్టూ తిరిగిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. విసుకు చెంది నిన్న అగ్రీవెన్స్ లో అధికారిపై కారం చెల్లినట్లు ఆమె తెలిపింది.
తాజావార్తలు
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!