TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన తొలి ‘టీజీ20 క్రికెట్ లీగ్’ ఆటగాళ్ల వేలం ప్రక్రియ నేడు రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా ముగిసింది. తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువ క్రికెటర్ల ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా జరిగిన ఈ ఆక్షన్‌లో ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఇందులో భాగంగా ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (రామోజీ గ్రూప్)కు చెందిన ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫ్రాంచైజీ మొత్తం రూ.58.95 లక్షలు వెచ్చించి, లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ 20 మందితో కూడిన ఒక జట్టును ఎంపిక చేసుకుంది. జూన్ 21 నుంచి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానున్న ఈ మెగా లీగ్ కోసం ఈ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన ఆటగాళ్ల వివరాల్లోకి వెళ్తే.. జట్టులో అత్యధిక ధర పలికిన ఆల్‌రౌండర్ అజయ్‌దేవ్ గౌడ్‌కు రూ.11 లక్షలు, అలాగే టాప్ ఆర్డర్ బ్యాటర్ అభిరత్ రెడ్డి మందాడికి రూ.11 లక్షలు వెచ్చించారు. వీరితో పాటు మిడిల్ ఆర్డర్ బలోపేతం కోసం ప్రణవ్ వర్మను రూ.8.5 లక్షలకు, సాయి వికాస్ రెడ్డిని రూ.4.25 లక్షలకు, అన్విత్ రెడ్డిని రూ.3.5 లక్షలకు మేనేజ్మెంట్ దక్కించుకుంది.
ఇక మిగిలిన జట్టు సభ్యులలో గణేశ్ గడుగు (రూ.3.25 లక్షలు), యశ్వీర్ గౌడ్ (రూ.3 లక్షలు), శ్రీనికేత్ (రూ.2.3 లక్షలు), అఖిల్ రాథోడ్ (రూ.1.6 లక్షలు), తరుణ్ రాజన్ (రూ.1.6 లక్షలు), షణ్ముఖ రాజన్ (రూ.1.5 లక్షలు), పి.అరవింద్ (రూ.లక్ష), సి అభినవ్ తేజ్ (రూ.లక్ష), ప్రేమ్ చరణ్ (రూ.95 వేలు) ఉన్నారు. అలాగే యువ ఆటగాళ్లయిన గుడెల్లి జశ్వంత్, వైష్ణవ్ రెడ్డి, నితిన్ నాయక్, ఎంఎం చరణ్, దేవ్ మెహతా, మరియు మిర్యాల ప్రత్యూష్కుమార్లను తలా రూ.75 వేల చొప్పున వెచ్చించి జట్టులోకి తీసుకున్నారు. భారత్ అండర్-19 , దేశవాళీ మ్యాచ్‌ల అనుభవమున్న సీనియర్లతో పాటు లోకల్ యంగ్ టాలెంట్‌తో ఈ జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!