buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
buchi babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలోని ఎమోషన్స్, చరణ్ యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ మధ్య ఒకే ఒక్క అంశంపై మాత్రం థియేటర్లలో డివైడ్ టాక్ వినిపిస్తోంది. కథ ఎంతో పీక్ ఎమోషనల్ నోట్లో సాగుతున్న సమయంలో, సెకండ్ హాఫ్‌లో అకస్మాత్తుగా ఒక ఐటెం సాంగ్‌ను జొప్పించడం ఆర్గానిక్ ఫ్లోను దెబ్బతీసిందంటూ సినిమా విశ్లేషకులు, ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు ఎంతో నిజాయితీగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా బుచ్చిబాబు గురువు, స్టార్ డైరెక్టర్ సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ (స్పెషల్ నంబర్స్) కథలో భాగంగా వస్తాయి. ‘రంగస్థలం’లో ‘జిగేలు రాణి’ అయినా, ‘పుష్ప’లో ‘ఊ అంటావా మావా’ అయినా సిట్యుయేషన్‌కు పర్ఫెక్ట్గా సింక్ అవుతాయి. కానీ ‘పెద్ది’ విషయంలో మాత్రం సీరియస్ డ్రామా నడుస్తుండగా సాంగ్ రావడంపై నెటిజన్లు పాయింట్ అవుట్ చేశారు. దీనిపై బుచ్చిబాబు ఓపెన్ అవుతూ.. “ప్రేక్షకులు అబ్సర్వ్ చేసింది వందకు వంద శాతం కరెక్ట్. సినిమా సెకండ్ హాఫ్ అంతా చాలా సీరియస్ నోట్లో, ఎమోషనల్‌గా వెళ్తుంది. అయితే మరీ అంత సీరియస్‌గా వెళ్తే ప్రేక్షకులు తట్టుకోగలరా? ఒకే రకమైన మూడ్‌లోకి వెళ్ళిపోతారేమో? కమర్షియల్ హంగులు మిస్ అవుతున్నామా? అనే ఒక చిన్న భయం, టెన్షన్ నాలో స్టార్ట్ అయ్యాయి. అందుకే సెకండ్ హాఫ్‌ను కాస్త బ్యాలెన్స్ చేయడానికి, కొంత కమర్షియల్ పప్ యాడ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఆ సాంగ్‌ను అక్కడ పెట్టాల్సి వచ్చింది” అని అంగీకరించారు.
Also Read
- Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
- Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.!
- Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
- Mouli: ఐదో తరగతిలో భయపడి ఏడ్చా.. ఇప్పుడు మైత్రీ మూవీస్‌తో సినిమా
ఒక కమర్షియల్ స్టార్ సినిమాను హ్యాండిల్ చేస్తున్నప్పుడు రైటర్‌గా, డైరెక్టర్‌గా కొన్ని ఒత్తిళ్లు ఉంటాయని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు. “ఇది నేను ఫోర్స్ ఫుల్‌గా రాసుకున్న సీన్ కాదు. ఒక ఫార్ములా కోసం, ట్రేడ్ లెక్కల కోసం చేసిన ప్రయత్నమే. చరణ్ సార్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా చేస్తున్నప్పుడు థియేటర్లలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే మాస్ ఆడియన్స్ కోసం ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయక తప్పదు. ఒకవేళ ఆ ప్లేస్మెంట్ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టి ఉంటే అది నా రైటింగ్ టెన్షన్ వల్లే జరిగింది” అంటూ బుచ్చిబాబు ఎంతో హుందాగా తన మేకింగ్ ఒత్తిడిని ఒప్పుకున్నారు. ఒక స్టార్ డైరెక్టర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి విమర్శలను ఓపెన్‌గా యాక్సెప్ట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Hyderabad: రేస్ క్లబ్ సమీపంలో భారీ పేకాట స్థావరం గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్.!
-
US Fed Interest Rate Decision: అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం
-
Satish Jarkiholi: ఓటర్ల జాబితా నుంచి కోటి పేర్ల తొలగింపు సరైనదే.. కాంగ్రెస్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
AP Local Elections 2026: ఏపీలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
ట్రెండింగ్
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..