Minister Peddireddy Ramachandra Reddy: వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. అవి స్మార్ట్ మీటర్లు కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Peddireddy Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లపై చర్చ జరిగింది.. ఈ సందర్భంగా అధికార, ప్రతిక్షాల మధ్య సభలో సవాళ్ల పర్వం చోటు చేసుకుంది.. మూడు ఎమ్మెల్సీల్లో ఓటమి పాలైనందుకు వైసీపీ సభ్యుల మైండ్ బ్లాంక్ అయ్యిందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.. ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రి సిదిరి అప్పలరాజు.. ధైర్యం ఉంటే టెక్కలిలో రాజీనామా చేసి గెలవాలని ఛాలెంజ్ విసిరారు. తాను కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు.. మరోవైపు.. వ్యవసాయ మోటార్లకు బిగించిన మీటర్లపై క్లారిటీ ఇచ్చారు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. శ్రీకాకుళంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్లు కాదు డిజిటల్ మీటర్లు మాత్రమేనన్న ఆయన.. పైలట్ ప్రాజెక్టుగా ఆ ప్రాంతంలో డిజిటల్ మీటర్లు బిగించాం.. మీటర్లు బిగించటం వల్ల దాదాపు 33 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఆదా అయ్యిందన్నారు.. వ్యవసాయ విద్యుత్ మీటర్ల వల్ల 33 శాతం విద్యుత్ ఆదా అయినట్టు తేలిందని స్పష్టం చేశారు.
Read Also: CM YS Jagan Review: అకాల వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
Also Read
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
అయితే, టీడీపీ, కమ్యూనిస్టులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి.. రాష్ట్రంలో 10 వేల మంది మినహా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.. రైతులకు 9 గంటల పగటి పూటే ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గుర్తుచేశారు. కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే స్మార్ట్ మీటర్లు పెట్టాలని భావిస్తున్నాం.. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్న విషయాలను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు అని ఎద్దేవా చేశారు.. ఇక, వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల అంశం పై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది.. స్మార్ట్ మీటర్లు రైతులకు ఉరితాడులను వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు.. ఆ ఆరోపణలను తిప్పి కొట్టారు వైసీపీ సభ్యులు.. ఎఫ్ఆర్బీఎమ్ లో రుణ పరిమితి పెంచుకోవడానికే ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టడం దారుణమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించగా.. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల పై బట్టలు ఆరేసుకోవాల్సిందే అన్నారు చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్.. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగితే బషీర్ బాగ్ లో రైతులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదన్న ఆయన.. పార్టీ లేదు బొక్కా లేదు అన్న అచ్చెన్నాయుడు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు.. అంటూ ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!