CM Chandrababu: కృష్ణా జలాలు లేకున్నా, గోదావరి నీటిని బనకచర్లకు తరలిస్తే కరువు ఉండదు..
- పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద వరం..
- ఏటా 2 వేల టీఎంసీలు సముంద్రంలోకి వెళ్తున్నాయి..
- ఏపీ 200 టీఎంసీలు, తెలంగాణ 200 టీఎంసీలు వాడుకోవచ్చు..
- రాయలసీమ ఒకప్పుడు రాళ్లసీమ, ఇప్పుడు కాదు..
- రాయలసీమ అభివృద్ధికి నా దగ్గర బ్లూ ప్లింట్ ఉంది: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న నీటితో జలాశయం వద్ద కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈరోజు కృష్ణనదికి జల హారతులు ఇచ్చి, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టులోని 6, 7, 8, 11 నెంబర్ల రేడియల్ గేట్లను తెరచి నీటిని కిందికి వదిలారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రిజర్వాయర్లను దేవాలయంగా భావిస్తాను.. జీవితానికి సంపద ఇచ్చేది జలాశయాలు.. టీడీపీ హయాంలోనే మెజారిటీ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించాం.. కృష్ణ, గోదావరి, పెన్నా , వంశధార నదులు ఉన్నాయి.. కృష్ణా నదికి నీళ్లు రాకపోయినా.. గోదావరి నుంచి బనకచర్ల ప్రాజెక్టుకు నీరు తెస్తే కరువు ఉండదు అని తేల్చి చెప్పారు. గోదావరి-బనకచర్ల నా సంకల్పం.. 554 టీఎంసీల నీళ్లు ఇప్పుడు నిలువ ఉన్నాయి.. రాబోయే రోజుల్లో 450 టీఎంసీల నీళ్లు వస్తే అన్ని జలాశయాలు కలకళలాడుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Operation Sindoor: యుద్ధంలో చైనా పాకిస్థాన్‌కు సహాయం చేసిందా? చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ క్లారిటీ..
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
ఇక, పోలవరం ఏపీకి పెద్దవరం అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏటా 2 వేల టీఎంసీలు సముంద్రంలోకి వెళ్తున్నాయి.. ఏపీ 200 టీఎంసీలు, తెలంగాణ 200 టీఎంసీలు వాడుకోవచ్చు అన్నారు. రాయలసీమ ఒకప్పుడు రాళ్లసీమ.. ఇప్పుడు కాదు.. రాయలసీమ అభివృద్ధికి నా దగ్గర బ్లూ ప్లింట్ ఉందన్నారు. ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి.. మెట్ట పంటలు వేస్తే ఆదాయం పెరుగుతుందని సూచించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తా.. సంక్షేమం , అభివృద్ధి రెండు కళ్ళు అని చెప్పా.. అదే చేస్తున్నాను.. వేరే పార్టీకి, టీడీపీకి తేడా చూడాలి.. ఐదేళ్లలో పింఛన్ 200 నుంచి 2 వేలు చేసా.. పింఛన్ వెయ్యి పెంచడానికి గత ప్రభుత్వం ఐదేళ్లు తీసుకుంది.. కానీ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్ అందజేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Bhatti Vikramarka : కేటీఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి.. భట్టి ఫైర్
అలాగే, భూగర్భ జలాలు పరిరక్షించాలి.. అప్పుడు కరువు అనే మాట ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇక, 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు అందజేస్తున్నాం.. ఇంటికి సోలార్ పెట్టుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఏపీ ప్రజల తరపున మల్లికార్జున స్వామిని వేడుకుంటున్నాను.. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా.. ఏ ప్రభుత్వం వల్ల జీవితాలు బాగు పడతాయో.. వారికి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే, తల్లికి వందనం ఇచ్చినందుకు రెండు వేళ్ళు చూపించి స్వాగతం పలికారు.. గత ఐదేళ్లు ప్రజల మొహల్లో నవ్వు మాయం అయింది.. ఇపుడు అందరి ముఖాల్లో నవ్వు కనిపిస్తుంది అన్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత అందికి తల్లికి వందనం ఇచ్చాము.. 7 మంది పిల్లలు ఉంటే లక్ష 5 వేలు ఇచ్చాం.. జనాభా పెంచాలి.. ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారి భారాన్ని ప్రభుత్వం పంచుకుంటుందన్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!