శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త. ఈరోజు నుంచి మల్లన్న స్పర్శ దర్శనం తిరిగి ప్రారంభం కానుంది. సామాన్య భక్తులకు వారంలో 4 రోజులు ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని దేవస్థానం కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు భక్తులు స్వామిని తాకే అవకాశం ఉంది. స్పర్శ దర్శనం సమయంలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి అన్న విషయం గుర్తుంచుకోవాలి. Also Read: AP Liquor Scam: కాలమే…
శ్రీశైలంలో రద్దీ రోజులలో మల్లన్న స్పర్శదర్శనంలో మార్పులు చేస్తూ నిర్ణయించింది.. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ స్పర్శదర్శనంలో మార్పులు చేసింది దేవస్థానం.. ఇక, మీదట ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం ప్రభుత్వ సెలవు రోజుల్లో రోజుకు 2 విడతలుగా మాత్రమే స్పర్శ దర్శనం కల్పించనున్నారు.. రద్దీ రోజుల్లో ప్రతి విడతకు 500 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచనుంది దేవస్థానం.. ఈ సమయంలో ఉదయం 7:30 గంటలకు.. తిరిగి రాత్రి 9 గంటలకు మాత్రమే శ్రీస్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నారు..
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న స్పర్శదర్శనంపై కీలక నిర్ణయం తీసుకుంది దేవస్థానం.. శ్రీశైలంలో ఇకపై భక్తుల రద్దీ రోజుల్లోనూ స్పర్శ దర్శనం కల్పించనున్నట్టు వెల్లడించారు నూతన ఈవో ఎం.శ్రీనివాసరావు.. అయితే, శని, ఆది, సోమవారాలు పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలివేస్తూ గతంలో దేవస్థానం ప్రకటించిన విషయం విదితమే కాగా.. భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి స్పర్శ దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు…
శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన సూచన.. ఇవాళ్టి నుండి ఈనెల 23వ తేదీ వరకు శ్రీశైలం మల్లన్న స్పర్శదర్శనం నిలిపివేస్తున్నట్టు ప్రటించారు శ్రీశైలం దేవస్థానం ఆలయ ఈవో లవన్న… కార్తీకమాసం భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి స్పర్శదర్శనం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది దేవస్థానం… భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆర్జిత సేవ, స్పర్శదర్శనాలు నిలివేస్తూ దేవస్థానం నిర్ణయం తీసుకుందని ఈవో లవన్న వెల్లడించారు… అయితే, ముందస్తుగా ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకున్న భక్తులకు మాత్రం రేపు…