Nakka Anandababu: దళిత ఓటు బ్యాంకు వైసీపీకి దూరం
టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి అంతే లేకుండా పోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతి జిల్లాలో ఇరు పార్టీల నేతలు ఎక్కడో చోట విమర్శలు చేసుకుంటూనే వున్నారు. దళిత వర్గాలపై జగన్ పార్టీది కపట ప్రేమ అని విమర్శించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు. ఎమ్మెల్సీ అనంతబాబుని సస్పెండ్ చేసినట్టు వైసీపీ డ్రామా ఆడింది.. అది దొంగ సస్పెన్షన్. గడప గడపకు కార్యక్రమంలో అనంతబాబు ఫోటోకు ఎమ్మెల్యే పాలాభిషేకం చేయటం దొంగ సస్పెన్షన్ కాక మరేంటి..?
అనంతబాబు సస్పెన్షనులో చిత్తశుద్ధి ఉంటే అనంతబాబు ఫోటోలు ఊరేగించిన ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య నేపథ్యంలో వచ్చిన ఉద్యమన్ని పక్క దారి పాటించడం కోసమే కోనసీమ, అమలాపురం అల్లర్లు. ఎమ్మెల్సీ అనంతబాబును హత్య కేసు నుంచి తప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కుటుంబసభ్యులు, ప్రతిపక్షం ఆందోళనతో కేసు పెట్టక తప్పలేదు.
అంబేద్కరును అల్లర్లలోకి లాగటం సిగ్గుచేటు. దళిత ఓటు బ్యాంక్ వైసీపీకి దూరమవుతున్నందుకే కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. పచ్చగా కళకళలాడే కోనసీమను తగల బడటానికి సీఎం జగనే కారణం అని ఆనందబాబు మండిపడ్డారు. సీఎం కార్యాలయం ఒక పథకం ప్రకారం ఆడిన కుట్ర అనడంలో ఎటువంటి సందేహం లేదు. కుట్రలోకి దళిత వర్గాలకు ఆరాధ్యుడైన అంబేద్కర్‌ను లాగడం శోచనీయం. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టే విధానంలో అక్కడ కుల ఘర్షణలను ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చారన్నారు.
కోనసీమ అల్లర్లకు ప్రధాన కారణం మంత్రులు, ఎమ్మెల్యేలేనని స్పష్టంగా తెలుస్తున్నా ప్రతిపక్షాల మీదకు నెట్టడానికి సీఎం జగనుకు సిగ్గు లేదా..? సాక్షాత్తూ మంత్రి విశ్వరూపే మా పార్టీ కౌన్సిలర్ హస్తం ఉందని చెప్పిన విషయం మర్చిపోయారా..? మంత్రి చెప్పిన విషయాన్ని సాక్ష్యంగా పోలీసులు తీసుకుంటారా..? కోనసీమ అల్లర్లకు వైసీపీ నేతలను పోలీసులు నిందితులుగా ప్రకటిస్తే.. సీఎం మాత్రం కోనసీమ అల్లర్లపై ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నారని ఆనందబాబు విమర్శించారు.
YSRCP: కర్నూలు జిల్లా వైసీపీలో వర్గపోరు.. గార్గేపురంలో ఉద్రిక్తత