Nakka Anandababu: దళిత ఓటు బ్యాంకు వైసీపీకి దూరం టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి అంతే లేకుండా పోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతి జిల్లాలో ఇరు పార్టీల నేతలు ఎక్కడో చోట విమర్శలు చేసుకుంటూనే వున్నారు. దళిత వర్గాలపై జగన్ పార్టీది కపట ప్రేమ అని విమర్శించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు. ఎమ్మెల్సీ అనంతబాబుని సస్పెండ్ చేసినట్టు వైసీపీ డ్రామా ఆడింది.. అది దొంగ సస్పెన్షన్. గడప గడపకు…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను విచారిస్తున్న రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. ఈ…
గత నెల 19న ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య జరిగింది. 23న పోలీసులు అనంతబాబును అదుపులోకి తీసుకున్నారు. అయితే మధ్యలో నాలుగు రోజులు ఆ సమస్యను హైలైట్ చేయడానికి టీడీపీ అన్ని ప్రయత్నాలు చేసింది. రాష్ట్ర స్థాయిలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది కూడా. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆ ఘటనపై టీడీపీకే చెందిన జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా ఎక్కడా పెదవి విప్పింది లేదు. అనంతబాబుకు జ్యోతుల నెహ్రూ, వరుపుల…
టీడీపీ మహానాడుకి జనం పోటెత్తారు. ప్రకాశం వేదికగా సైకిల్ పార్టీ గుబాళించింది. మహానాడు2022 సందర్భంగా నారా లోకేష్ మీడియాతో ముచ్చటించారు. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ తన పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేశారు. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు.. ప్రజలను హింసించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ కేడరునే హింసిస్తోందన్నారు. ఓ ఎమ్మెల్సీ తన డ్రైవర్, పార్టీ కార్యకర్తనే చంపేస్తే.. మరో ఎమ్మెల్యే తన పార్టీ గ్రామ స్థాయి నేతను హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.…
కాకినాడ జీజీహెచ్ దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యం కేసు మరింత జఠిలంగా మారింది. సుబ్రమణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. అయితే పోస్టుమార్టం జరిగితే తప్ప ఈ కేసు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. తొలుత భార్య అంగీకారంతో పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించినా అనంతరం కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను బలవంతంగా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం సుబ్రమణ్యం భార్య కూడా…
కాకినాడ జీజీహెచ్ లోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం వుంది. పోస్ట్ మార్టం ఇంకా పూర్తికాలేదు. ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్టు చేస్తే తప్ప పోస్ట్ మార్టం చేయడానికి అంగీకరిస్తూ సంతకం చేసేది లేదని అంటున్నారు కుటుంబ సభ్యులు. దీంతో జీజీహెచ్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిన్న అంతా కాకినాడ జీజీహెచ్ లో హై డ్రామా కొనసాగింది. నిన్న ఉదయం 11 గంటల నుంచి మార్చురీ లోనే ఉంది సుబ్రహ్మణ్యం మృతదేహం. కాకినాడ టూ టౌన్…
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం కలిగించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ అతని తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై ఎఫ్ ఐ ఆర్ కాపీ బయటకు వచ్చింది. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు పోలీసులు మృతి పై విచారణ జరపాలని సుబ్రహ్మణ్యం తల్లి ఫిర్యాదు చేసింది. అనుమానితుల పేర్లు ఫిర్యాదు లో చెప్పలేదని చెబుతున్నారు పోలీసులు. అనుమానాస్పద మృతిగా మాత్రమే కేసు…
కాకినాడ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు అనుమానాస్పద స్థితిలో డ్రైవర్ సుబ్రమణ్యం డెడ్‌బాడీ లభించడం స్థానికంగా కలకలం రేపింది. అయితే మృతుడి కుటుంబానికి అండగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు సుబ్రమణ్యం మృతిపై చంద్రబాబు టీడీపీ నిజనిర్ధారణ కమిటీని నియమించారు. కమిటీ సభ్యులుగా పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్ బాబు, ఎం.ఎస్.రాజు, పీతల సుజాత, పిల్లి మాణిక్యాలరావును చంద్రబాబు ఎంపిక చేశారు. శనివారం నాడు కాకినాడలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనుంది. MLC Anantha…