ఎక్కడ…? ఎమ్మెల్సీ ఎక్కడ…? పోస్ట్ వచ్చిన కొత్తల్లో పెద్ద పెద్ద టూర్ ప్లాన్స్ వేసి కొన్నాళ్ళు ఓ రేంజ్‌లో హడావిడి చేసిన నాయకుడు ఇప్పుడెందుకు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు? అసలు ఏపీకే ఆయన చుట్టమైపోయారా? ప్రస్తుతం జనసేన వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఏ ఎమ్మెల్సీ కోసం పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి? ఎందుకలా..? నాగబాబు…. జనసేన కీలక నేత. పార్టీలో పవన్ తర్వాత ఆ స్థాయి ప్రాధాన్యం ఇస్తుంది కేడర్. ఇక ఎమ్మెల్సీ పదవివచ్చిన…
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల మీద జనసేన స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. రకరకాల ఈక్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని పార్టీ ముఖ్యులు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోందని, వాళ్ళ కదలికలు ఇదే విషయం చెబుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు జిల్లా నేతలతో వరుస మీటింగ్స్ పెట్టడం, వారం రోజుల వ్యవధిలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో పర్యటించడం లాంటివి నోట్ చేసుకోవాల్సిన పరిణామాలంటున్నారు.
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ స్టాలిన్. 2006లో వచ్చిన ఈ సినిమాను నాగబాబు నిర్మించారు. ఈ సినిమా 2006లో వచ్చింది. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే కానుకగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. స్టాలిన్ సినిమా నా కెరీర్ లో ఎంతో ప్రత్యేకం. ఆ సినిమా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని నేర్పించింది.…
తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉత్తరాంధ్ర. 2024 ఎన్నికల ఫలితాలు, ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీలే అందుకు నిదర్శనం. అందులోనూ గ్రేటర్ విశాఖ సిటీలో అయితే సైకిల్ సవారీకి ఎదురే లేకుండా పోయింది. కూటమి కట్టినా...ఒంటరిగా పోటీ చేసినా సిటీ పరిధిలోని నాలుగు స్ధానాలు టీడీపీ ఖాతాలోనే పడుతున్నాయి.
MLC Nagababu Review on HHVM Movie: ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ జులై 24న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన వీరమల్లు చిత్రం మిశ్రమ స్పందనకే పరిమితమైంది. అయితే సినిమాలో పవన్ నటన, యాక్షన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వీరమల్లు సినిమాను పవన్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు వీక్షించారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. సినిమాపై వైసీపీ పార్టీ దుష్ప్రచారం…
మెగా డాటర్ నిహారిక చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సుమారు మూడు ఏళ్ల తర్వాత వీరిద్దరూ మనస్పర్ధలతో మ్యూచువల్ డైవర్స్ తీసుకుని విడిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయం మీద నాగబాబు నోరు విప్పారు. నిజానికి నిహారికతో తాను అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పుకొచ్చారు. కానీ వాళ్ల పర్సనల్ విషయాలు ఎప్పుడూ అడిగే వాడిని కాదు. నిజానికి వాళ్ళు నిర్మాతలుగా లేదా హీరోలుగా అక్కడ…
Nagababu : మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి తీవ్ర అనారోగ్యం అని.. హాస్పిటల్ లో జాయిన్ చేశారంటూ ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేబినెట్ మధ్యలో నుంచే హైదరాబాద్ వచ్చేస్తున్నాడని.. చిరంజీవి, రామ్ చరణ్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్ని వస్తున్నారంటూ ఒకటే రూమర్లు వస్తున్నాయి. తాజాగా వీటిపై నాగబాబు స్పందించారు. Read Also : Amitabh Bachchan : అందుకే ఐశ్వర్యను పొగడను.. అమితాబ్ షాకింగ్ కామెంట్స్ ‘మా తల్లి…
Janasena : పిఠాపురంలో ఈ రోజు జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభ పైనే అదరి దృష్టి ఉంది. పిఠాపురంలో జరుగుతున్న సభకు వెళ్లడానికి అన్ని దారుల్లో జనసైనికులు బయలు దేరుతున్నారు. అయితే సభ దగ్గర మాత్రం మూడు దారులు పెట్టారు. ఈ మూడు దారుల నుంచే సభకు చేరుకోవాలి. ఒక్కో దారిలో ఒక్కొక్కరికి పర్మిషన్ ఇచ్చారు. ఇందులో చూసుకుంటే రాజావారి ద్వారం నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా, వీర మహిళలకు మాత్రమే వెళ్లాలి. వీరు ఇక్కడ…
శాసన మండలిలో అడుగుపెట్టబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి బరిలోకి దిగిన ఆయన ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.. అయితే ఈ సందర్భంగా.. తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు నాగబాబు.. నా బాధ్యతను పెంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి కృతజ్ఞతలు తెలిపారు..
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత బర్త్ డే సందర్భంగా ఆమెతో దిగిన ఫొటోను నిహారిక ఇన్ స్టాలో పోస్టు చేసింది. నా పార్ట్ టైమ్ అమ్మ, ఫుల్ టైమ్ అక్క, అండ్ ఆల్ టైమ్ బెస్ట్ ఫ్రెండ్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది. రీసెంట్ గానే ఆమె మద్రాస్ కారన్ సినిమాలో నటించింది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. ప్రస్తుతం మరో రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్నట్టు సమాచారం.