Margani Bharat: పవన్‌కు ఎంపీ భరత్ సవాల్.. 175 సీట్లకు పోటీ చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Margani Bharat Challenges Pawan Kalyan: తన వారాహి యాత్రలో భాగంగా.. శుక్రవారం భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ఒక ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీతో సై అంటే సై అని ఆయన ఓంపెన్ ఛాలెంజ్ చేశారు. దీనిపై తాజాగా వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్.. సై అంటే సై దేనికి? ఏపిలో 175 సీట్లకు పోటీ చేస్తారా? అని డిమాండ్ చేశారు. 175 స్థానాల్లో పోటీ చేస్తే.. ఆ పోటీకి వైసీపీ ‘సై అంటే సై’ అని సవాల్ చేశారు. పవన్ ఒక సినిమా స్టార్ కాబట్టి, ఆయన సభలకు యువత వస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ.. సీఎం జగన్ ఒక పొలిటికల్ స్టార్ అని, అందుకే ఆయనకు ప్రజాభిమానం ఉందని తెలిపారు. పవన్ కేవలం గోదావరి జిల్లాల్లోనే పోటీ చేస్తారా? ఆ జిల్లాలకే పరిమితమా? అని ప్రశ్నించారు. వైసీపీని ఓడించాలని, పవన్‌కి ఎందుకంత కక్ష అని నిలదీశారు. చంద్రబాబు అవినీతి పాలన అందిస్తే, జగన్ మెరుగైన పాలన అందించారని.. చంద్రబాబుకు, జగన్‌కు తేడా గ్రహించాలని ప్రజల్ని సూచించారు.
Guinness World Records : ఒంటిపై మంటలతో పరుగెత్తిన రియల్ హీరో.. హ్యాట్సాప్ బాసూ..
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్‌ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
అంతకుముందు కూడా.. సీఎం జగన్ పేరు తలరుచుకుంటేనే కొంతమందికి బీపీ వస్తుందని మార్గాని భరత్ నిప్పులు చెరిగారు. ఇక్కడ బీపీ అంటే.. చంద్రబాబు, పవన్ అని అభివర్ణించారు. పవన్‌కి నిర్దిష్టమైన ఆలోచన లేదని.. రాష్ట్రాభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో బాబు, పవన్ గాడిదలు కాశారా? అని మండిపడ్డారు. కనీసం ఓటు హక్కు కూడా ఉందో లేదో తెలియని వారే పవన్ సభలకు వస్తున్నారని తూర్పారపట్టారు. పవన్ సభలకు వచ్చే అల్లరిమూకల్ని చూసి.. సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. దత్తపుత్రుడ్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. కేంద్రం నుంచి సీఎం జగన్ వందశాతం నిధులు సాధిస్తున్నారని.. 2024 ఎన్నికల్లో కేంద్రంలో ఎక్కువ సీట్ల సంఖ్య వైసీపీకి వస్తే, ప్రత్యేక హోదా కూడా లభిస్తుందని పేర్కొన్నారు.
Ee Nagaraniki Emaindi: గ్యాంగ్స్ తో వచ్చి రచ్చ చేస్తున్నారు మైక్…
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!